డేటా సేవ్ చేసే LinkedIn లైట్ యాప్ !

Posted By: Madhavi Lagishetty

ఫేస్‌బుక్, ట్విటర్ ఇప్పుడు లింక్డ్‌ఇన్. మైక్రోసాప్ట్ కంపెనీకి చెందిన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ లైట్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఎక్కువ మంది వినియోగదారులకు చేరాలనే ఉద్దేశ్యంతో మొదటిసారిగా ఇండియాలోని కస్టమర్లకే ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌లో లింక్డ్‌ఇన్ వాడుతున్నప్పుడు డేటాతో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొవడానికి ఈ లైట్ వెర్షన్ ఉపయోగపడుతుంది.

డేటా సేవ్ చేసే LinkedIn లైట్ యాప్ !

ట్విటర్, ఫేస్‌బుక్ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం లింక్డ్‌ఇన్ లైట్ యాప్‌ను రిలీజ్ చేసిన మూడో కంపెనీ ఇది . అయితే లింక్డ్‌ఇన్ రెడీ చేసిన లింక్డ్‌ఇన్ లైట్ 1ఎంబీ కన్నా తక్కువ సైజులో ఉంటుంది. త్వరలోనే ఈ యాప్‌ను 60దేశాల్లో రిలీజ్ చేసేందుకు సంస్థ ప్రయత్నలు చేస్తోంది. స్లో కనెక్టివీటి ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా లింక్డ్ ఇన్ లైట్ వెర్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లైట్ వెర్షన్ 80శాతం డేటాను వాడటాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు 5సెకన్లలోపే పేజీలను లోడ్ చేస్తుంది. 

డేటా సేవ్ చేసే LinkedIn లైట్ యాప్ !

ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆప్షన్లు వాడాలో తెలిపేందుకు ఎక్కువ సమయం తీసుకోకపోవడం ఈ యాప్ ప్రత్యేకత. ఫస్ట్ టైం యాప్ ఓపెన్ చేయగానే కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. కానీ ఈ యాప్ హోం పేజీ చాలా ఈజీగా ఉంటుందని లింక్డ్‌ఇన్ లైట్ తెలిపింది. ఇక జాబ్స్ , ఆపర్చునిటీస్ , నెట్‌వర్క్, ప్రొఫైల్ వివరాలు పేజీకి చివర్లో ఉంటాయి. అంతేకాదు నెట్‌వర్క్‌లోకి వెళ్లితే కనెక్షన్, పెండింగ్ ఇన్విటేషన్స్ వంటి సూచనలు కూడా ఉంటాయి.

Read more about:
English summary
It weighs in at only 1MB and reduces data usage by 80 per cent.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot