లింక్ : ఉచిత వైఫై కనెక్ట్, ఉచిత వైఫై మ్యాప్, అసలేంటి ఇది ?
మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సార్లు మీరు ఆఫీసు పనులు చేయాల్సి రావచ్చు. ట్రావెలింగ్ సమయంలో మీ ఫోన్ డేటా సరిగా కనెక్ట్ కాకపోవచ్చు.
మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సార్లు మీరు ఆఫీసు పనులు చేయాల్సి రావచ్చు. ట్రావెలింగ్ సమయంలో మీ ఫోన్ డేటా సరిగా కనెక్ట్ కాకపోవచ్చు. అలాంటి సంధర్భాలలో ఏవైనా అత్యవసర మెయిల్స్ పంపాలంటే చాలా కస్టమవుతుంది. దీనికి ప్రధాన కారణం డేటా కనెక్ట్ కాకపోవడం అలాగే డేటా స్పీడ్ తక్కువగా ఉండటం లాంటి అంశాలు మనలి సమస్యలకు గురిచేస్తుంటాయి. చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడలేమా అనేదానికి సొల్యూషన్ వచ్చింది. మీరు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు Linq: Free WiFi Map, Free WiFi Connect India సాయం చేస్తుంది. మరి ఇది ఎలా వాడాలనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Linq: Free WiFi Map, Free WiFi Connect India
Linq: Free WiFi Map, Free WiFi Connect India అనేది WANI ట్రాయ్ కంప్లయిట్ యాప్. దీని ద్వారా మీరు Airport, Railway, Rail Google WiFi, Jionet, Train, Metro లాంటి వాటిల్లో ఉచిత వైఫై పొందే అవకాశం ఉంది. Delhi, Bangalore, Mumbai లాంటి నగరాల్లో ఈ యాప్ ద్వారా డేటా లేకున్నా ఉచిత వైఫై మ్యాప్ కనుక్కోవచ్చు.

ఉచితంగా వైఫై పొందే అవకాశం
దీంతో పాటు ఇది మీ ప్రయాణ అవసరాలను అలాగే ఇంటి వైఫై అవసరాలు తీరుస్తుంది. దీని ద్వారా మీరు పొటెన్సియల్ వైఫై హాట్ స్పాట్ కి ఉచితంగా వైఫై పొందే అవకాశం ఉంది. అలాగే మీరు మీ ఫోన్ ఇంటర్నెట్ డేటాను (Jionet, Airtel, Tata Docomo) పోర్టబుల్ వైఫై హాట్ స్పాట్ ద్వారా షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

ఫీచర్లు
ఈ యాప్ ద్వారా మీకు దగ్గర్లో ఏవైనా ఉచిత వైఫై సర్వర్లు ఉంటే దానిని క్యాచ్ చేసి వెంటనే దానికి కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ పొందే అవకాశం ఉంది.
దీని ద్వారా ఇంటిలో వైఫై అనుభవాన్ని చాలా హ్యాపిగా ఎంజాయ్ చేయవచ్చు. మీ పార్టనర్ నెట్ వర్క్ కి కనెక్ట్ డేటాతో కూడిన అమేజింగ్ ఆఫర్స్ ని పొందవచ్చు. ఇంకా మరిని సదుపాయాలు ఇందులో పొందవచ్చు.

ఎప్పటికప్పుడు ట్రాక్
మీ వైఫై ఉపయోగాన్ని ఈ యాప్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. అలాగే మీ ఉచిత వైఫై ఇంటర్నెట్ వాడకపు historyని ఎప్పటికప్పుడు access చేస్తుంది. మీరు ఖరీదైన వైఫై హాట్ స్పాట్ లు కొనే అవసరం లేకుండా ఇది మీ అవసరాలను తీరుస్తుంది.

డేటాను ఇతరులకు షేర్ చేయడం
మీరు మీ డేటాను ఇతరులకు షేర్ చేయడం కాని అలాగే ఇతరులు తమ వద్ద మిగిలి ఉన్న డేటాను మీకు షేర్ చేయడం కాని ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మరింత ఆనందంగా పనులు చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి
ఈ యాప్ కావాల్సిన వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ ఇదే.
https://play.google.com/store/apps/details?id=com.i2e1.swapp


Click it and Unblock the Notifications








