తక్కువ ఇంటర్నెట్‌ను ఖర్చు చేసే యాప్స్ ఇవే

రోజురోజుకు పెరిగిపోతోన్న ఆండ్రాయిడ్ యాప్స్ మొబైల్ డేటాను హారతి కర్పూరంలో ఆవిరి చేసేస్తున్నాయి. రిలయన్స్ జియో రాకతో డేటా కొరత తీరినప్పటికి మొబైల్ డేటాను పొదుపుగా వాడుకోవటమనేది ఓ మంచి అలవాటు. మీ స్మార్ట్‌ఫోన్‌లలో మొబైల్ డేటా ఆదా అవ్వాలంటే యాప్స్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. మీ రోజువారి స్మార్‌ఫోన్ వినియోగంలో భాగంగా తక్కువు ఇంటర్నెట్‌ను ఖర్చుచేస్తూ వేగవంతమైన పనితీరును కనబర్చగలిగే లైట్ వర్షన్ యాప్స్‌ను మీకు పరిచయం చేయటం జరుగుతోంది...

Read More : BSNL రూ.189తో రోజుకు 3జీబి డేటా, నెలంతా కాల్స్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ లైట్ (Facebook Lite)

తక్కువ డేటాను మాత్రమే ఉపయోగించుకోగలిగే ఫేస్‌బుక్ లైట్ వర్షన్ యాప్ ఫోటోలను కంప్రెస్ చేసేస్తుంది. దీంతో డేటా చాలా తక్కువుగా ఖర్చవుతుంది. ఈ యాప్‌లో GIF files ఓపెన్ కావు, వీడియోలను కూడా ప్లే చేసుకోలేదు. 2జీ ఇంటర్నెట్‌లోనూ ఈ యాప్ పనిచేస్తుంది. ముఖ్యమైన డేటాను మాత్రమే ఈ యాప్ చూపుతుంది. ఫేస్‌బుక్‌ను వాడుతున్నప్పటికి మొబైల్ డేటా ఖర్చు కాకూడదనుకునే వారికి ఫేస్‌బుక్ లైట్ బెస్ట్ ఛాయిస్.

మెసెంజర్ లైట్ (Messenger Lite)

ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌కు సంబంధించి లైటర్ వర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లైటర్ వర్షన్ మెసెంజర్ యాప్ ద్వారా టెక్స్టింగ్‌తో పాటు ఇమేజ్‌లను అటాచ్ చేసుకునే వీలుంటుంది. స్టిక్కర్స్‌ను కూడా కొంత మేరకు ఉపయోగించుకోవచ్చు. ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవటం కుదరదు. దీంతో డేటా మరింత ఆదా అవుతుంది. 

ట్విట్టర్ లైట్ (Twitter Lite)

ట్విట్టర్ ప్రధాన యాప్‌తో పోలిస్తే లైటర్ వర్షన్ యాప్ చాలా తక్కువ డేటాను ఖర్చు చేసుకుంటుంది. mobile.twitter.comలోకి వెళ్లటం ద్వారా Twitter Liteను పొందవచ్చు. ఈ వర్షన్‌లో ఫోటోలు, వీడియోలు కనిపించవు. మీకు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు.

స్కైప్ లైట్ (Skype Lite)

వీడియో కాల్స్ కోసం మనం ఉపయోగిచే స్కైప్ యాప్ ఎంత మొబైల్ డేటాను ఖర్చు చేస్తుందో మనందరికి తెలుసు. ఈ నేపథ్యంలో స్కైప్ అందుబాటులోకి తీసుకువచ్చిన Skype Lite వినియోగించుకోవటం ద్వారా డేటా ఖర్చును సగానికి తగ్గించుకోవచ్చు. వీడియో కాలింగ్ సమయంలో Skype Lite యాప్ డేటాను కంప్రెస్ చేసేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ (Instagram)

ప్రముఖ ఫోటో షేరింగ్ అప్లికేషన్‌లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో పాటు స్టోరీలకు ప్లే చేసుకునే సమయంలో ఎక్కువ మొబైల్ డేటాను ఖర్చు చేసేస్తుంటుంది. ఇటువటి పరిస్థితుల్లో ప్రొఫైల్ మోడ్‌ను మార్చుకోవటం ద్వారా తక్కువ డేటా ఖర్చయ్యే వీలుంటుంది. ప్రొఫైల్ మోడ్‌‍లను మార్చుకునే క్రమంలో Profile > Options > Cellular Data Use and switch to Use Less Data.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
List of 'Lite' apps that saves your mobile data. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot