రివ్యూలు చూసి మోసపోకండి, ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఈ న్యూస్ చదవండి
ఈ రోజుల్లో వినియోగదారులు ఏవైనా ఉత్పత్తులను ఆర్డర్ చేసే ముందు ఆన్‌లైన్‌లో వాటి రివ్యూలను చూడడం సర్వసాధారణంగా మారింది. ఏదైనా వస్తువు కొనే ముందు దాని రివ్యూ ఎలా ఉంది. పాజిటివ్ గా ఉందా లేక నెగిటివ్ గా ఉంద
ఈ రోజుల్లో వినియోగదారులు ఏవైనా ఉత్పత్తులను ఆర్డర్ చేసే ముందు ఆన్‌లైన్‌లో వాటి రివ్యూలను చూడడం సర్వసాధారణంగా మారింది. ఏదైనా వస్తువు కొనే ముందు దాని రివ్యూ ఎలా ఉంది. పాజిటివ్ గా ఉందా లేక నెగిటివ్ గా ఉందా అని చెక్ చేస్తుంటారు. అందరూ పాజిటివ్ ఇస్తే వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా కొనేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత అది పనిచేయడం లేదని తీరిగ్గా బాధపడుతుంటారు.

అయితే దీని వెనుక పెట్టుబడిదారుల వ్యూహం వేరేగా ఉందని నిపుణులు గుర్తించారు. యూజర్లకు ఫేక్ రివ్యూలను అందిస్తూ కోట్ల లాభాలను కొల్లగొడుతున్నారు. దీనిని పెట్టుబడిగా మార్చుకున్న కొందరు ఇంటర్నెట్‌లో నకిలీ ఆన్‌లైన్ రివ్యూ రేటింగ్‌లను విక్రయిస్తున్నట్లు వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మంచి రివ్యూలు రాసిన వారికి
ఇటీవల అమెజాన్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిపై మంచి రివ్యూలు రాసిన వారికి పూర్తి రిఫండ్ ఇస్తామంటూ ప్రోత్సహించే కొన్ని ఫేస్‌బుక్ గ్రూపులు ఏర్పడ్డాయి. అలాంటి పలు ఫేస్‌బుక్ గ్రూపులు ఈ మధ్య ఓ మీడియా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి.

ఖండించిన అమెజాన్
కొత్త వాళ్లు వాటిలో చేరిన వెంటనే అమెజాన్ ఉత్పత్తులపై పాజిటివ్ రివ్యూలు రాస్తే పూర్తి రిఫండ్ చేస్తామంటూ వారికి ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే తాము ఇలా రిఫండ్ చేసే రివ్యూలను ప్రోత్సహించబోమని అమెజాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు కానీ, అమ్మకందార్లు కానీ రివ్యూ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. లేని పక్షంలో అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ట్రస్ట్‌పైలెట్' వెబ్‌సైట్
ఆన్‌లైన్ రివ్యూలను విక్రయిస్తున్న 'ట్రస్ట్‌పైలెట్' వెబ్‌సైట్ తమను తాము అత్యంత విశ్వసనీయమైన ఆన్‌లైన్ రివ్యూ సంస్థగా ప్రకటించుకుంటోంది. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా రివ్యూలను పోస్టు చేయవచ్చు. అయితే తమ వెబ్‌సైట్‌ను దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించబోమని ఆ సైట్ పేర్కొంటోంది.

ఐదు ఉత్పత్తుల్లో ఒకటి నకిలీదే
ఈ మధ్య సర్వేలో కూడా దాదాపు ఫేక్ వస్తువులు విక్రయానికి పెడుతున్నారని కూడా తేలింది. వారి సర్వేలో ఈ-టెయిలర్స్ అమ్మే ప్రతి ఐదు ఉత్పత్తుల్లో ఒకటి నకిలీదని తేలింది. వీటిల్లో ఎక్కువగా యువతరం వాడే ఫ్రాగ్రెన్సెస్, కాస్మెటిక్స్, స్పోర్టింగ్ గూడ్స్, బ్యాగ్‌లు ఉన్నాయి. ఇందు కోసం 30 వేల మందిని వారు సర్వే చేశారు.

20 శాతం మంది
గత ఆరు మాసాల్లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మీరు నకిలీ ఉత్పత్తులు అందుకున్నారని అడిగితే... వీరిలో 20 శాతం మంది అవుననే చెప్పారు. అతికొద్ది మంది మాత్రం అది నకిలీదో... అసలైనదో తమకు తెలియదన్నారు.

ఏ ఈ-కామర్స్ సైట్ నుంచి..
ఇక ఏ ఈ-కామర్స్ సైట్ నుంచి ఎక్కువ నకిలీ వస్తువులు వస్తున్నాయిని ప్రశ్నిస్తే 35 శాతం మంది స్నాప్‌డీల్ అని బదులిచ్చారు. ఆ తరువాత ఫ్లిప్‌కార్ట్ 22 శాతం, పేటీఎం మాల్ 21 శాతం, అమేజాన్ 20 శాతం డూప్లికేట్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నాయని సర్వేలో తేలింది

ఖచ్చితమైన పాలసీని
ఇదే విషయాన్ని సదరు ఈ-కామర్స్ సైట్ల ముందు పెడితే... నకిలీ ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టేందుకు తాము ఖచ్చితమైన పాలసీని అవలంభిస్తున్నట్టు తెలిపాయి. ఒకవేళ ఎవరైనా నకిలీవని ఫిర్యాదు చేస్తే.. ఆ అమ్మకందారులను తొలగించేస్తున్నామని, ఎలాంట చార్జీలూ లేకుండా రిటర్న్ తీసుకొంటున్నామని వెల్లడించాయి.

ఆన్‌లైన్ వ్యాపారం
ఆన్‌లైన్ వ్యాపారం అన్ని ప్రాంతాల్లోనూ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, సంప్రదాయ మార్కెట్లకే అలవాటుపడిన కొన్ని కోట్ల మంది ఇంకా అన్‌లైన్‌ను అనుమానంగానే చూస్తున్నారు. నిజమే సరైన జాగ్రత్తలు తీసుకోక గుడ్డిగా ఆన్‌లైన్‌లో బేరాలు చేస్తే నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వీలయినంతవరకు జాగ్రత్తగా షాపింగ్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications








