మీ ఫోన్‌లో mAadhaar ఉందా..? అయితే ఇవి తెలుసుకోోండి ?

Posted By: BOMMU SIVANJANEYULU

ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తూ యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ), సరికొత్త మొబైల్ అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది. mAadhaar పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా యూజర్లు తన ఆధార్ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ లలోనే యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. దీంతో ఫిజికల్ గా ఆధార్ కార్డును క్యారీ చేయవల్సిన అవసరం ఉండదు. ఎమ్-ఆధార్ యాప్ ద్వారా చేకూరే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఐఫోన్ లాక్ అయిందా, అన్‌లాక్ కోసం 48 సంవత్సరాలు ఆగాల్సిందే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది

ఈ మొబైల్ ఆధార్ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవాలంటే యూజర్ ముందుగా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వద్ద మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఆధార్ సమాచారాన్ని యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

ఆధార్ కాపీని వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు

డౌన్‌లోడ్ అయ్యే ఆధార్ డేటాలో ఆధార్‌లో ఉన్న పేరు, డేటా ఆఫ్ బర్త్, అడ్రస్ అలానే ఫోటోగ్రాఫ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో mAadhaar యాప్ కలిగి ఉన్న యూజర్లు ఇక పై ఆధార్ కాపీని తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రూఫ్ క్రింద యాప్‌లోని డేటాను చూపిస్తే సరిపోతుంది.

 

 

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే..

mAadhaar యాప్‌కు సంబంధించిన APK ఫైల్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. iOS కోసం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఎమ్ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు

mAadhaar యాప్‌ ద్వారా యూజర్లు తమ ఆధార్ డేటాను అప్‌డేట్ చసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో తమ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.

క్యూఆర్ కోడ్ సదుపాయం

మీ మొబైల్ నెంబర్, మీ కుటుంబంలోని ఇతర కుటుంబ సభ్యులు ఆధార్ కార్డ్‌లతో లింక్ అయి ఉన్నట్లయితే మూడు వరకు ఆధార్ ప్రొఫైల్స్‌ను యాప్‌లో స్టోర్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్‌లో క్యూఆర్ కోడ్ పేరుతో మరో ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తన ఈ-కేవైసీ డేటాను షేర్ లేదా అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
mAadhaar App Helps You Carry Aadhaar Card On Phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot