Home
Apps

mAadhaar యాప్ లాంచ్ అయ్యింది, ఇక మీ ఫోనే ఆధార్

స్మార్ట్‌ఫోన్‌లలో mAadhaar యాప్ కలిగి ఉన్న యూజర్లు ఇక పై ఆధార్ కాపీని తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.

By Sivanjaneyulu Bommu

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇక పై తమ ఆధార్ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్‌గా లాంచ్ చేసిన mAadhaar యాప్ ద్వారా క్యారీ చేసే వీలుంటుంది. ఈ మొబైల్ ఆధార్ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవాలంటే యూజర్ ముందుగా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వద్ద తన మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది.

ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే

ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే

ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే తమ ఆధార్ సమాచారాన్ని యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. డౌన్‌లోడ్ అయ్యే డేటాలో ఆధార్‌లో ఉన్న పేరు, డేటా ఆఫ్ బర్త్, అడ్రస్ అలానే ఫోటోగ్రాఫ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో mAadhaar యాప్ కలిగి ఉన్న యూజర్లు ఇక పై ఆధార్ కాపీని తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రూఫ్ క్రింద యాప్‌లోని డేటాను చూపిస్తే సరిపోతుంది.

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే..

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే..

mAadhaar appకు సంబంధించిన APK ఫైల్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. iOS కోసం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతానికి బేటా స్టేజ్‌లో ఉన్న ఈ అప్లికేషన్ త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌లను అందుకోనుంది. mAadhaar app ద్వారా యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.

బయోమెట్రిక్ డేటా అంటే..?

బయోమెట్రిక్ డేటా అంటే..?

ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.

 ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం ..

ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం ..

మీ నుంచి సేకరించిన బయోమెట్రిక్ డేటాను ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం ఉపయోగించటం జరుగుతుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు మీరు కొత్త సిమ్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ క్రింద ఆధార్ కార్డ్‌ను ఇచ్చారు. ఆ క్రమంలో మీ KYC వెరిఫికేషన్ నిమిత్తం సంబంధిత టెలికం కంపెనీ, మీ వేలి ముద్ర ఆధారంగా బయోమెట్రిక్ వివరాలను పరిశీలించటం జరుగుతుంది.

 అంత సెక్యూర్ కాదని తెలుస్తోంది

అంత సెక్యూర్ కాదని తెలుస్తోంది

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలతో ఎంతో సురక్షితమని భావిస్తోన్న ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ (Aadhaar biometric authentication)కూడా అంత సెక్యూర్ కాదని తెలుస్తోంది.

 biometric authenticationను వాడుకోవాలి..

biometric authenticationను వాడుకోవాలి..

ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తమ అనుమతి లేకుండా తీసుకుని దుర్వినియోగపరిచారంటూ కొందరు ఆరోపించటంతో ఆధార్ బయోమెట్రిక్ అంత సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. బయోమెట్రిక్ ప్రమణికరణ ద్వారా తమ ఆధార్ కార్డును వాడుకున్నట్లు UIDAI నుంచి మెయిల్స్ వచ్చాయని, వాస్తవానికి తాము biometric authenticationను వాడుకోలేదని చెబుతున్నారు.

మీ బయోమెట్రిక్ సమాచారాన్ని లాంక్ చేసుకోవాలంటే..?

మీ బయోమెట్రిక్ సమాచారాన్ని లాంక్ చేసుకోవాలంటే..?

ఇటువంటి పరిస్థితి భవిష్యత్‌లో తలెత్తకుండా ఉండాలంటే UIDAI సర్వర్లలో లాక్ అయి ఉన్న మీ బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఇలా చేయటం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను వేరొకరు యాక్సిస్ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే అన్‌లాక్ చేసుకుని, అవసరం లేనపుడు లాక్ చేసుకోవచ్చు.

Aadhaar biometric authenticationను లాక్ అలానే అన్‌లాక్ చేయటం ఎలా..?

Aadhaar biometric authenticationను లాక్ అలానే అన్‌లాక్ చేయటం ఎలా..?

ముందుగా మీ కంప్యూటర్ నుంచి UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన కాలమ్ క్రింద మరో సెక్యూరీటీ కోడ్ కాలమ్ మీకు కనిపిస్తుంది. అక్కడ పైన ఉంచిన సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. పేజీలో క్రింద కనిపించే Generate OTP పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో one-time password అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి Verify ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు Enable biometric lockingను చెక్ చేసుకోండి. ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్‌ను చెక్ చేసిన తరువాత Enable ఆప్సన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు లాక్ కాబడతాయి. ఒకవేళ లాక్ ను disable చేయాలనుకుంటే Enable biometric lockingను అన్ చెక్ చేసి disable పై క్లిక్ చేయండి. పై సూచనలను పాటించటం ద్వారా మీ Aadhaar biometric సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. తాజాగా అందుబాటులోకి వచ్చిన mAadhaar app ద్వారా కూడా ఈ ప్రొసీజర్‌ను కంప్లీట్ చేయవచ్చు.

one-time password ఆధారంగానే రిక్వస్ట్..

one-time password ఆధారంగానే రిక్వస్ట్..

యూజర్ తన Aadhaar biometric డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు అలానే రిక్వస్ట్ లను one-time password ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు. వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర అలానే ఐరిస్ స్కాన్ లాక్ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
mAadhaar App Launched by UIDAI, Lets You Carry Aadhaar on Your Android Phone. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X