ఎంఆధార్ రివ్యూ, ఇప్పుడు మూడు ప్రొఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు

By Gizbot Bureau
|

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంఆధార్ పేరుతో ఒక యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టే. అయితే ఆధార్ డేటాబేస్‌లో మీకు సంబంధించి కాంటాక్టు నంబర్ ఏదైతే ఉందో... అదే నంబర్ ను వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లోకి మాత్రమే ఎంఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ యాప్ ఉంటే మీకు ఆధార్ కార్డు అవపరం లేదు. ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికెళ్లినా దీని సహాయంతో మీరు ఇతరులకు చూపించవచ్చు. ఎంఆధార్ యాప్‌తో ఆధార్ వినియోగదారులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఈ యాప్ మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ పైన వర్షన్ ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది. ఆపిల్ యూజర్లకయితే ఐఓఎస్ 10 దాని పై వర్షన్కు మాత్రమే పనిచేస్తుంది.

mAadhaar డౌన్లోడ్ ఎలా ?

mAadhaar డౌన్లోడ్ ఎలా ?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి mAadhaar అని సెర్చ్ చేస్తే యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత మొదటి స్టెప్ లోనే పాస్ వర్డ్ అడుగుతుంది. అందులో 8 నుంచి 12 క్యారక్టర్లతో పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవాలి. ఇందులో కనీసం ఒక నంబర్, ఒక అల్ఫాబెట్, ఒక స్పెషల్ క్యారక్టర్ ఉండాలి.యాప్ ను యాక్సెస్ చేసుకునే సమయంలో ఓటీపీ వస్తే దాన్ని యాడ్ చేయక్కర్లేదు. యాప్ స్వయంగా తీసుకుంటుంది. ఈ యాప్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ డేటా బేస్ తో కనెక్ట్ అయి ఉంటే మీ ఆధార్ వివరాలు యాప్ లో కనిపిస్తాయి.అయితే ఇంటర్నెట్ తప్పక ఉండాలి. ఆఫ్ లైన్ లో ఈ యాప్ పనిచేయదు. 

మూడు ప్రొఫైల్స్ వరకు...
 

మూడు ప్రొఫైల్స్ వరకు...

ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో ఇతరుల ఆధార్ నంబర్ కు కాంటాక్టు నంబర్ గా మీ మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఉన్నారనుకోండి. అప్పుడు వారి ఆధార్ ప్రొఫైల్ ను మీ స్మార్ట్ ఫోన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక యూజర్ తన మొబైల్ లో మూడు ప్రొఫైల్స్ వరకే యాడ్ చేసుకోగలరు. ఏవైనా సందేహాలు ఉంటే సహకారం కోసం [email protected] సంప్రదించొచ్చు. ప్రొఫైల్ యాడ్ చేసే ముందు మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆధార్ తీసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ను వాడుతూ ఉండడం అవసరం. 

క్యూఆర్ కోడ్ స్కాన్

క్యూఆర్ కోడ్ స్కాన్

ముందుగా పాస్ వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత పేజీలో ఆధార్ కార్డు వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. దీన్నే ప్రొఫైల్ అంటారు. లేదంటే ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాల్ని యాప్ తీసేసుకుంటుంది. అప్పుడు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ ను ఆధార్ యాప్ దానంతట అదే తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడు ఎంఆధార్ యాప్ ను వినియోగించుకోవాలన్నా ముందుగా పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఫోన్ పోయినప్పటికీ కంగారు పడాల్సిన పనిలేదు.

దీని ఉపయోగాలు 

దీని ఉపయోగాలు 

ఆధార్ ఫిజికల్ కార్డు గానీ, జిరాక్స్ కాపీలు గానీ వెంట తీసుకెళ్లక్కర్లేదు. ఇదే యాప్ లో ఆధార్ బయోమెట్రిక్ యాక్సెస్ ఇవ్వడానికి వీలుగా లాక్, అన్ లాక్ చేసుకునే సదుపాయమూ ఉంది. యూజర్లు తమ ప్రొఫైల్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలంటే సులభంగా ఈ యాప్ నుంచే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సంబంధిత రిక్వెస్ట్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ సిబ్బంది సమీక్షించి, ఆమోదించిన తర్వాత ప్రొఫైల్ వివరాలు అప్ డేట్ అవుతాయి. ఆధార్ వివరాలు బయటకు చెప్పకుండా ఎంఆధార్ యాప్ నుంచి క్యూ ఆర్ కోడ్ ను, పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ చేసిన ఈ కేవైసీ డేటాను షేర్ చేసుకోవచ్చు. దీంతో ఏ సర్వీసు ప్రొవైడర్ అయినా యాప్ సాయంతో సంబంధిత వ్యక్తి ఆధార్ వివరాలను పొందడానికి అవకాశం ఉంటుంది. యూజర్లు ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ కాకుండా తాత్కాలిక వన్ టైమ్ పాస్ వర్డ్ ను యాప్ ద్వారా పొందే ఫీచర్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
mAadhaar review: An upgraded app with new interface; now allows users to add 3 profiles

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X