వాట్సాప్ తరహాలో మేడ్ ఇన్ ఇండియా అరట్టై యాప్‌నకు త్వరలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్!
మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్ అరట్టై (Arattai Messaging App) ఇటీవల ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తుల పిలుపు సహా కేంద్ర మంత్రుల సోషల్ మీడియా ప్రమోషన్ అనంతరం కేవలం రోజుల వ్యవధిలోనే ఈ అరట్టై యాప్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఈ యాప్ త్వరలో వాట్సాప్‌నకు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందు కోసం అనేక చర్యలు ఉంటుందని చెబుతున్నారు.
అరట్టై యాప్ :
అరట్టై అనేది తమిళ పదం. అంటే మాట్లాడుకోవడం అని అర్థం. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జోహో కార్పొరేషన్ ఈ యాప్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ అనేక విభాగాల్లో 55 కు పైగా బిజినెస్ అప్లికేషన్లను కలిగి ఉంది. అనేక దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

వాట్సాప్ తరహాలోనే అనేక ఫీచర్లు :
అరట్టై యాప్ లో వాట్సాప్ తరహాలోనే అనేక ఫీచర్‌లు ఉన్నాయి. చాట్, కాలింగ్, వీడియో కాల్స్, ఫోటోలు మరియు వీడియో షేరింగ్, స్టేటస్, ఛానళ్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు మీటింగ్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇటీవలే ఈ యాప్ ఆపిల్ స్టోర్ యాప్ సోషల్ నెట్‌వర్క్ విభాగంలో తొలి స్థానంలో నిలిచింది.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ పై కీలక వివరాలు :
వాట్సాప్‌లో చాట్, వాయిస్, వీడియో కాలింగ్ కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండగా.. అరట్టై యాప్‌లో ప్రస్తుతం కాల్స్ కు మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్టు ఉంది. ఈ ఫీచర్ ఉంటే మీ మెసేజ్‌లను సంస్థతోపాటు ఇతరులు చదివేందుకు అవకాశం ఉండదు. తాజాగా ఈ అంశంపై జోహో సీఈవో మణి వెంబు స్పందించారు. సంస్థ భవిష్యత్ ప్రణాళికలను ఇండియా టుడే టెక్‌తో పంచుకున్నారు.
ప్రస్తుతం ఇదే తమ ప్రాధాన్యత :
అరట్టై యాప్‌లో ప్రస్తుతం వాయిస్, వీడియో కాల్స్‌కు మాత్రమే ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్టును మెసేజ్‌లకు (Chat) కూడా విస్తరిస్తామని జోహో సీఈవో చెప్పారు. ప్రస్తుతం ఈ అంశాన్ని అధిక ప్రాధాన్యతగా తీసుకున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ఫీచర్‌ను విడుదల చేస్తామని చెప్పారు.
కేవలం రోజుల వ్యవధిలోనే ట్రెండింగ్ :
ఈ అరట్టై యాప్ కేవలం రోజుల వ్యవధిలోనే 3500 సైన్ అప్‌ల నుంచి 3,50,000 సైన్ అప్‌ల స్థాయికి ఎదిగింది. అనూహ్యంగా పెరిగిన యూజర్లకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు గతంలోనే సంస్థ తెలిపింది. మేడ్ ఇన్ ఇండియా యాప్ కావడం, కేంద్ర మంత్రుల ప్రకటనలు, యూజర్ల వ్యక్తిగత డేటాను వాణిజ్య అవసరాలకు ఉపయోగించమనే వ్యాఖ్యలు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని భద్రతా ఫీచర్లు :
అరట్టై యాప్‌లో మరిన్ని భద్రత ఫీచర్లను జోడించడం, ఈ ప్లాట్‌ఫాంను బహుముఖ వేదికగా మార్చడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. దీంతోపాటు వినియోగదారులకు ఉపయోగపడేలా మరిన్ని యాప్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








