Home
Apps

80మంది యువతులపై అత్యాచారం, చిన్న యాప్ సాయం చేసింది

ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయాయి. అయితే వీటితో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి.

By Hazarath Aiah

ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయాయి. అయితే వీటితో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా అపరిమితంగా దూసుకుపోతున్న నేటి యుగంలో ఓ చిన్న యాప్ 80 మందిపై అత్యాచారం చేసేలా ప్రేరేపించింది. నమ్మశక్యంగాని ఈ వార్తను అందరూ నమ్మి తీరాల్సిందే. ఈ ఘటన ప్రపంచంలో ఎక్కడో జరగలేదు. మన ఇండియాలోని తమిళనాడులో జరిగింది. ఘటన పూర్తి వివరాల్లోకెళితే..

తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్‌ కుమార్‌..

తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్‌ కుమార్‌..

తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్‌ కుమార్‌ ఎంసీఏ చదివాడు. టెక్నాలజీపై మంచి పట్టుంది. కానీ, గతి తప్పాడు. నీచానికి పాల్పడి జైలు పాలయ్యాడు.

80 మంది మహిళల వ్యక్తిగత సమాచారాన్ని ..

80 మంది మహిళల వ్యక్తిగత సమాచారాన్ని ..

సాఫ్ట్‌వేర్‌ సాయంతో 80 మంది మహిళల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారిలో పలువురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తను లొంగని వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. వారి వ్యక్తిగత సంభాషణలు, వీడియోలు, ఫొటోలను సంపాదించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడమే పనిగా పెట్టుకున్నాడు.

ట్రాక్‌ వ్యూ’ అనే రహస్య యాప్‌

ట్రాక్‌ వ్యూ’ అనే రహస్య యాప్‌

బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడుతూ ఫోన్‌కాల్‌ చేయాలని వారి ఫోన్‌ అడిగి తీసుకుని ‘ట్రాక్‌ వ్యూ' అనే రహస్య యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి తన ఫోన్‌తో అనుసంధానం చేసేవాడు.

ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించి..

ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించి..

దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్‌ ఫోన్‌లోకి చేరేవి. తర్వాత తన కోరిక తీర్చకుంటే వీటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు.

యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలని..

యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలని..

వాట్సప్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలని ఎవరైనా కోరితే అతను వాట్సప్‌తో పాటు ట్రాక్‌వ్యూ అనే యాప్‌ను అతను ఆమె మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఇటువంటి దారుణాలకు పాల్పడేవాడని పోలీసులకు తెలిపిన విషయాల్లో వెల్లడైంది.

బ్లాక్ మెయిల్ లో భాగంగా..

బ్లాక్ మెయిల్ లో భాగంగా..

ఇలా బ్లాక్ మెయిల్ లో భాగంగా ఓ యువతికి ఫోన్ చేసి ఇలానే బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆమె తన సమస్యను సోదరుడికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు.

బాధితురాలి సెల్‌ నుండి మేసేజ్..

బాధితురాలి సెల్‌ నుండి మేసేజ్..

దీంతో సోదరుడు ఓ పథకాన్ని రచించాడు. ఏకాంతంగా కలుసుకొందామని ఓ ప్రాంతానికి రావాల్సిందిగా బాధితురాలి సెల్‌ నుండి మేసేజ్ పంపాడు. దినేశ్ అక్కడికి రావడానికి ముందే బాధితురాలు, ఆమె సోదరి, బంధువులు చేరుకున్నారు.

 తీరిగ్గా వచ్చిన దినేశ్‌ను చూసి..

తీరిగ్గా వచ్చిన దినేశ్‌ను చూసి..

అనంతరం తీరిగ్గా వచ్చిన దినేశ్‌ను చూసి వారు ఆశ్చర్యపోయారు. బాధితురాలికి అతడు వరుసకు తమ్ముడు అవుతాడు. దీంతో విస్తుపోయిన బంధువులు అతడిని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు.

80 మంది యువతుల డేటా

80 మంది యువతుల డేటా

దినేశ్ వద్ద మొత్తం 80 మంది యువతుల డేటా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దినేశ్ డేటాలో తన సొంత చెల్లెలు వివరాలు కూడా ఉండడం పోలీసులనే ఆశ్చర్యపరిచింది.

దారుణం ఏంటంటే

దారుణం ఏంటంటే

దారుణం ఏంటంటే తన బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిన వారిపై అత్యాచారానికి తెగబడే దినేశ్ తర్వాత వారి దుస్తులను దాచుకునే వాడు. అతడి బెదిరింపులకు లొంగని వారి వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లకు అమ్మి సొమ్ము చేసుకునే వాడని పోలీసులు తెలిపారు.

ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు

ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు

అతని ల్యాప్ , మొబైల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిందితుడిపై ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదుచేశారు.

Best Mobiles in India

English summary
MBA graduate arrested for blackmailing woman with Track view app More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X