Home
Apps

Threads App 11 సంవత్సరాల తర్వాత తొలి ట్వీట్‌ చేసిన జుకర్‌బర్గ్‌.. ఎమోజీతో స్పందించిన ఎలాన్‌మస్క్‌..!

ట్విట్టర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. Threads పేరిట విడుదలైన యాప్‌ ఈ ఉదయం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, iOS ప్లేస్టోర్‌ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. భారత్‌ సహా సుమారు 100 దేశాల్లో థ్రెడ్స్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. థ్రెడ్స్‌ యాప్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

యాప్‌ అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లో 2 మిలియన్‌ (20 లక్షలు) మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మరియు 4 గంటల్లో ఏకంగా 5 మిలియన్ల (50 లక్షలు) మంది అకౌంట్లు తెరిచినట్లు మెటా సీఈవో మార్గ్ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.

Meta CEO mark Zuckerberg tweets after 11 years

అయితే ఈ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు 11 సంవత్సరాల తర్వాత మెటా సీఈవో జుకర్‌బర్గ్‌.. థ్రెడ్స్‌ యాప్‌ లాంచింగ్‌ను ప్రస్తావిస్తూ తొలి ట్వీట్‌ చేశారు. జుకర్‌బర్గ్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఓ ఫోటోను ట్వీట్‌ చేశారు. 1976 సంవత్సరానికి చెందిన స్పైడర్‌మ్యాన్‌ కార్టూన్‌ అది.

ఇందులో విలన్‌.. హీరో తరహా డ్రెస్సులు ధరించి ఉంటాడు. అయితే ఈ ట్వీట్‌ మస్క్‌ను ఉద్దేశించే మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేశారని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ చివరిసారిగా 2012 జనవరి 18న ట్వీట్‌ చేశారు. సుమారు 11 సంవత్సరాల తర్వాత థ్రెడ్స్‌ యాప్‌ విడుదల సందర్భంగా ఇవాళ ట్వీట్‌ చేశారు.

Meta CEO mark Zuckerberg tweets after 11 years

థ్రెడ్స్‌ యాప్ విడుదల సందర్భంగా మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌.. థ్రెడ్స్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. థ్రెడ్స్‌ యాప్‌ అనేది ఫ్రెండ్లీ పబ్లిక్‌ స్పేస్‌ అని, టెక్స్ట్‌ రూపంలో సంభాషించుకొనేవారికి ఈ యాప్‌ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మంచి కమ్యూనిటి అవసరం అని భావిస్తున్నట్లు చెప్పారు.

థ్రెడ్స్‌ యాజర్ల సంఖ్య ట్విట్టర్‌ను మించిపోతుందా అనే నెటిజన్‌ ప్రశ్నపై జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కొంత పట్టవచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వంద కోట్ల మంది యాజర్లతో ఓ పబ్లిక్ స్పేస్‌ ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ అవకాశం ట్విట్టర్‌కు వచ్చినా వారు సరిగా వినియోగించలేకపోయారని విమర్శించారు.

Meta CEO mark Zuckerberg tweets after 11 years

ట్విట్టర్‌కు పోటీగా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ యాప్‌ డిజైన్‌, ఫీచర్లపై ఓ ట్విట్టర్‌ యూజర్‌ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. థ్రెడ్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసేందుకు మెటా యాజమాన్యం కీబోర్డులోని Ctrl+C+V (కాపీ పేస్ట్‌) మాత్రమే వినియోగించింది అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఓ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు.

థ్రెడ్స్‌ యాప్‌లో చాలా వరకు ట్విట్టర్‌ తరహా ఫీచర్లను ఉన్నాయి. కానీ థ్రెడ్స్‌ యాప్‌లో 500 అక్షరాల లిమిట్‌ ఉంది. అదే ట్విట్టర్‌లో కేవలం 280 అక్షరాలు మాత్రమే పోస్ట్‌ చేయవచ్చు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌నేమ్‌తోనే థ్రెడ్స్‌ యాప్‌లోనూ లాగిన్‌ కావచ్చు. ఇన్‌స్టాలో ఫాలో అయిన వారిని థ్రెడ్స్‌లో కూడా ఫాలో కావచ్చు. మరియు 5 నిమిషాల నిడివితో వీడియోలను కూడా పోస్ట్‌ చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Meta CEO mark Zuckerberg tweets after 11 years and elon musk comments on threads app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X