Threads యూప్ వినియోగిస్తున్నారా.. త్వరలో ఇన్‌స్టాగ్రామ్ తరహా ఫీచర్ అందుబాటులోకి రానుంది..!!
మెటా నేతృత్వంలోని థ్రెడ్స్ (Threads) ఇటీవల 175 మిలియన్ ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉందని ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ గత నెలలో వెల్లడించారు. ఇందులో భారత్ యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. గత సంవత్సరం ఈ యాప్‌ను మెటా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు 50 మిలియన్ల ట్యాగ్స్ క్రియేట్ చేసినట్లు గత నెలలో చెప్పారు. అయితే X పోటీగా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్ ప్రస్తుతం అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
తాజా నివేదిక ప్రకారం థ్రెడ్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. TechCrunch నివేదిక ప్రకారం.. థ్రెడ్స్ యాప్‌లో 24 గంటలపాటు మాత్రమే కనిపించేలా పోస్ట్‌లను క్రియేట్ చేసే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉందని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరేజీ తరహాలో ఈ ఫీచర్ పనిచేస్తుందని సమాచారం.

ప్రస్తుతం పోటీ సంస్థలుగా ఉన్న X, బ్లూస్కై, Mastondon, థ్రెడ్స్ లో.. తొలిసారిగా Threads లో ఈ తరహా ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ తరహా ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో మెటా సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఫీచర్ పూర్తి స్థాయి పనితీరు గురించి వివరాలను వెల్లడించలేదు.
థ్రెడ్స్ 24 గంటల ఫీచర్ అనేక ప్రత్యేకతలున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ ఫోస్ట్‌పై క్లిక్ చేస్తే ఇంకా ఎంత సమయంలో ఆ ఫోస్ట్ డిలీట్ కానుందో చెబుతుంది. దీంతోపాటు పోస్ట్‌పైన ఓ నోట్ కూడా కనిపిస్తుంది. 24 గంటల్లో ఈ ఫోస్ట్, ఇతర స్పందనలు కూడా డిలీట్ కానున్నాయనే నోట్ కనిపిస్తుంది.
జులై నెల తొలివారంలో మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు. థ్రెడ్స్ ప్లాట్‌ఫాం 175 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లకు చేరుకుందని తెలిపారు. భారత యూజర్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ప్రారంభంలో గణనీయ స్థాయిలో యూజర్లకు కలిగి ఉన్న థ్రెడ్స్.. అనంతరం భారీ స్థాయిలో తగ్గారు. దీంతో వినియోగదారులను ఆకట్టుకొనే విధంగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
గత నెల ప్రకటనలోనే ప్రపంచవ్యాప్తంగా థ్రెడ్స్ యూజర్లు 50 మిలియన్ల ట్యాగ్స్ రూపొందించినట్లు చెప్పారు. అయితే భారత్‌లో సినిమాలు, టీవీ, OTT సహా సెలబ్రిటీలు మరియు క్రీడల కోసం ఎక్కువగా ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీటితోపాటు క్రెకెట్ పైన భారీగా ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








