వాట్సాప్ కీలక ఫీచర్ విడుదల.. ఇలా చేస్తే కొత్త నంబర్ల నుంచి వాట్సాప్ కాల్ రాదు..!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు కలిగిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గత నెలలో వినియోగదారులకు ఎదురైన సమస్యకు చెక్ పెట్టింది. ఇందుకోసం కీలక ఫీచర్‌ను విడుదల చేసింది. గతంలో వాట్సాప్ వినియోగదారులు అంతర్జాతీయ స్కామ్ కాల్స్‌తో ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించింది. పరిష్కరించేందుకు వాట్సాప్ సంస్థతో మాట్లాడుతున్నట్లు గతంలోనే ప్రకటించింది.
మెటా నేతృత్వంలోనే వాట్సాప్ విడుదల చేసిన ఫీచర్‌తో మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సైలెంట్ అయిపోతుంది. అంటే వాట్సాప్ కాల్ వచ్చినా బయటకు వినిపించదు. ఈ ఫీచర్ గురించి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ వేదికగా వెల్లడించారు. ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత భద్రతను పరిరక్షించడమే ఈ ఫీచర్ ఉద్దేశమని తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు అందులోని స్కామ్, స్పామ్ కాల్స్‌ను ఈ ఫీచర్ గుర్తిస్తుందని వాట్సాప్ తెలిపింది. అంటే మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు ఫోన్ రింగ్ అవ్వదు. కేవలం వారి నంబర్లు మాత్రమే వాట్సాప్ కాల్ వివరాల్లో చూపుతాయి.
వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకొనేందుకు వారి వాట్సాప్ సెట్టింగులు ఓపెన్ చేయాలి. అనంతరం ప్రైవసీ పైన క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించిన కాల్స్ ఆప్షన్‌పై టాప్ చేయాలి. అక్కడ కనిపించిన Silence unknown callers ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి.
అంతర్జాతీయ స్కామ్, స్పామ్ కాల్స్‌తో వాట్సాప్ వినియోగదారులు అవస్థలు పడిన నేపథ్యంలో వాట్సాప్ తక్షణ చర్యలు తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో సుమారు 50 శాతానికిపైగా అంతర్జాతీయ స్కామ్ కాల్స్‌ను తగ్గించినట్లు గతనెలలోనే పేర్కొంది. మెటా నేతృత్వంలోని వాట్సాప్ తీసుకొచ్చిన తాజా ఫీచర్‌తో వినియోగదారులు తమ ప్రైవసీని కాపాడుకోవచ్చు. వాట్సాప్ వినియోగదారులు తమను ఎవరు సంప్రదించవచ్చునో ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది.
వాట్సాప్ ప్రైవసీ సెట్టింగులను తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగుల్లోని "స్టార్ట్ చెకప్" ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం యాప్ యొక్క మల్టిపుల్ ప్రైవసీ లేయర్ల ద్వారా నేవిగేట్ చేస్తుంది. మెసేజ్‌లు, కాల్ మరియు వ్యక్తిగత భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అనుమతి ఇస్తుంది.
అయితే వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు చాట్ లాక్, డిస్సెపియరింగ్ మెసెజ్‌లు, స్క్రీన్‌షాట్ లాక్, ఆన్‌లైన్ స్టేటస్‌ను ప్రైవేట్ చేయడం సహా అనేక ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications