Whatsapp లో కీలక ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం?
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తన వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇటీవల కాలంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మల్టిపుల్ చాట్‌లను పిన్ చేసే ఫీచర్‌ను విడుదల చేసింది.
వాట్సాప్ తాజాగా స్టేటస్ అప్‌డేట్స్ కోసం కొత్త లేఅవుట్‌ను (Whatsapp New Layout Feature) టెస్టింగ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది.

ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌లో మరో రెండు అదనపు బటన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరా, పెన్సిల్ ఐకాన్లు ఉండనున్నాయి. వీటి ద్వారా ఫొటో, వీడియో సహా ఇతర టెక్ట్స్‌లను స్టేటస్ అప్‌డేట్లుగా షేర్ చేసేందుకు వీలుంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలుస్తోంది.
గతంలో వాట్సాప్ రెండు ఫ్లోటింగ్ యాక్షన్ బటన్లను కలిగి ఉండేది. వీటి ద్వారా స్టేటస్‌లో కంటెంట్‌ను షేర్ చేసుకొనే వీలుంటుంది. అనంతరం ఛానల్ ట్యాబ్‌ను అప్‌డేట్ ట్యాబ్‌లో మెర్జింగ్ చేశారు. మరియు కెమెరా, పెన్సిల్ ఐకాన్‌లను స్టేటస్ అప్‌డేట్స్‌లో ఇంటిగ్రేట్ చేసింది. అయితే వాట్సాప్ వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
*ఇటీవల వాట్సాప్‌లో వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌లను పిన్ చేసుకొనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వినియోగదారులకు చాలా సమయం ఆదా అవుతుంది. అయితే ఇతర మెసేజింగ్ యాప్‌ల మాదిరిగా కాకుండా వాట్సాప్‌లో గరిష్ఠంగా 30 రోజులు మాత్రమే పిన్ చేయవచ్చు. డిఫార్ట్ ఎంపిక 7 రోజులు మరియు పిన్ చేసేందుకు కనీస సమయం 24 గంటలపాటు ఉంటుంది.
వాట్సాప్ మెనూలోకి వెళ్లి పిన్‌పైన క్లిక్ చేయడం ద్వారా సమయం సహా చాట్‌ను పిన్ చేసుకోవచ్చు. ఐఫోన్‌లో చాట్‌పై కుడివైపునకు స్పైప్ చేయడం ద్వారా పిన్ చేయవచ్చు. అదే ఆండ్రాయిడ్ ఫోన్‌లో చాట్‌ను లాంగ్ ఫ్రెస్ చేయడం ద్వారా పిన్ చేయవచ్చు.
గ్రూప్ అడ్మిన్‌లు మాత్రమే లేదా మెంబర్‌లు అందరూ మెసేజ్ పిన్ చేయాలా అనే విషయాన్ని కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా iMessage మరియు టెలిగ్రామ్ వంటి యాప్‌లు గ్రూప్ చాట్ లేదా వ్యక్తి గత చాట్‌లను పిన్ చేసేందుకు వినియోగదారులకు అనుమతి ఇస్తున్నారు.
*దీంతోపాటు వాట్సాప్ ఇటీవలే 'వ్యూ వన్ వాయిస్ మెసేజెస్' ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని కేవలం ఒకసారి మాత్రమే ప్లే చేసేందుకు అవకాశం ఉంటుంది. మరియు వాట్సాప్ స్టేటస్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ నేరుగా షేర్ చేసేందుకు అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








