Skype Lite వచ్చేసింది

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కైప్ యాప్‌తో పోలిస్తే లైటర్ వర్షన్ యాప్ 60% డేటాను చేస్తుందని లాంచ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

|

ప్రత్యేకించి, ఇండియన్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ లైటర్ వర్షన్ స్కైప్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుధవారం ముంబైలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్ లో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల Skype Liteను విడుదల చేసారు.

Skype Lite వచ్చేసింది

టచ్‌ స్ర్కీన్ పనిచేయటం లేదా..?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కైప్ యాప్‌తో పోలిస్తే లైటర్ వర్షన్ యాప్ 60% డేటాను చేస్తుందని లాంచ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇంటర్నెట్ సిగ్నల్ తక్కువుగా ఉన్న సమయంలోనూ ఈ యాప్ ద్వారా మెసేజెస్ ఇంకా కాల్స్ కూడా పంపుకోవచ్చని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Skype Lite వచ్చేసింది

రూ.99తో 2018 వరకు జియో ఉచితం
జూన్, 2017 నాటికి Skype Lite యాప్‌కు ఆధార్ ఇంటిగ్రేషన్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ సదుపాయంతో గుర్తు తెలియన కాలర్స్‌కు సంబంధించిన వివరాలను ట్రాక్ చేసే వీలుంటుంది. కేవలం 13MB సైజును మాత్రమే కలిగి ఉండే ఈ లైటర్ వర్షన్ యాప్‌ను స్టోరేజ్ స్పేస్ తక్కువుగా ఉండే ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఉపయోగించుకోవచ్చు.

Skype Lite వచ్చేసింది

కింద పడినా పగలని స్మార్ట్‌ఫోన్‌లు

తెలుగుతో సహా 7 ప్రాంతీయ భాషలను స్కైప్ లైట్ యాప్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో పాటు గుజరాతీ, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం ఇంకా ఉర్దూ భాషలలో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్‌లలో స్కైప్ లైట్ యాప్‌ను డీఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా సెట్ చేసుకుని రకరకాల botsను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఫైల్స్‌ను ఫోన్‌లోకి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోకుండానే యాప్ ద్వారా షేరింగ్ పెట్టుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Microsoft announces Made for India Skype Lite for Android users. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X