ఈ యాప్ ద్వారా వీడియో కాల్ లో ఒకేసారి 20,000 మందితో మాట్లాడవచ్చు!!!

|

లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు. వీరు ప్రతి ఒక్కరు తమ యొక్క టీమ్ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్ వంటి వీడియో కాలింగ్ యాప్ లను వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ తన టీమ్ వీడియో యాప్ లో కొత్త కొత్త అప్ డేట్ లను చేసింది.

 

మైక్రోసాఫ్ట్ టీం కొత్త అప్ డేట్

మైక్రోసాఫ్ట్ టీం కొత్త అప్ డేట్

ఈ వారంలో విడుదల చేసిన కొత్త అప్ డేట్ లో భాగంగా గ్రూప్ మీటింగులలో పాల్గొనేవారి సంఖ్య 20,000లకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విధంగా జరిగే సమావేశాలు వన్ వే సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే హోస్ట్ చేసే వారు స్క్రీన్‌పై ఇతర వ్యక్తులను మాత్రమే చూడగలరు కానీ వారితో సంభాషించలేరు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అప్ డేట్ లలో భాగంగా జూలై నెలలో ఈ కొత్త టూల్ లను మొదట ప్రకటించారు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందరికి అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ టీమ్ స్లాక్‌తో సన్నిహితంగా పోటీపడే సంస్థ యొక్క సహకార టూల్.

మైక్రోసాఫ్ట్ టీం గ్రూప్ మీటింగు
 

మైక్రోసాఫ్ట్ టీం గ్రూప్ మీటింగు

గ్రూప్ మీటింగులలో ఒకేసారి 1,000 మంది పాల్గొనేవారు ఇప్పుడు టూ-వే వీడియో సమావేశాలలో పాల్గొనవచ్చని కంపెనీ పేర్కొంది. వీటితో పాటు రాబోయే నెలల్లో టీమ్స్ బ్రాండెడ్ మీటింగ్ వర్చువల్ లాబీ రూమ్ లను కూడా అందిస్తాయి. చాలా మంది ప్రజలు ఇంటి నుండి పని చేయడానికి పరిమితం కావడంతో ఈ కొత్త అప్ డేట్ లు కార్పొరేట్‌ సంస్థలలో పనిచేసే వారికి వారి యొక్క మీటింగులను కొత్త-సాధారణ పద్ధతిలో నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ ఫీచర్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పేమెంట్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల చివరి నుండి మైక్రోసాఫ్ట్ టీం ఈ టూల్ లను ఉచిత ట్రయల్ ఎంపిక ద్వారా అందిస్తాయి.

మైక్రోసాఫ్ట్ టీం కొత్త ఫీచర్లు

మైక్రోసాఫ్ట్ టీం కొత్త ఫీచర్లు

గత నెల మైక్రోసాఫ్ట్ టీం ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజా అప్ డేట్ లో ఆటోమేటెడ్ స్పందనలు, కోర్టానా ఇంటిగ్రేషన్, న్యూ టుగెదర్ మోడ్ వంటి AI- ఆధారిత ఫీచర్లను అనుసంధానిస్తుంది. కరోనావైరస్ విజృంభన సమయంలో మీటింగులో లీనమయ్యే అనుభవాన్ని అందించడానికి ఈ ఫీచర్స్ దోహదం చేస్తాయి.

మైక్రోసాఫ్ట్ టీం న్యూ టుగెదర్ మోడ్ ఫీచర్

మైక్రోసాఫ్ట్ టీం న్యూ టుగెదర్ మోడ్ ఫీచర్

మైక్రోసాఫ్ట్ టీం యొక్క క్రొత్త టుగెదర్ మోడ్ ప్రజల ముఖాలను మరియు భుజాలను విభజించడానికి AI ని ఉపయోగిస్తుంది. అలాగే మిమ్మల్ని మరియు మీ సహోద్యోగులను వర్చువల్ వాతావరణంలో ఉంచడానికి కూడా సహకరిస్తుంది. మీటింగ్ రూమ్ లేదా మరెక్కడ నుంచి అయినా సరే క్లాస్‌మేట్స్ లేదా వర్క్ టీమ్‌లతో సమావేశాన్ని ప్రారంభించగల సదుపాయం కలిగి ఉంది. సరళంగా చెప్పాలంటే పాల్గొనేవారి యొక్క బ్యాక్ గ్రౌండ్ లో డిజిటల్‌గా ఉంచడానికి AI విభజన సాంకేతికతను ఉపయోగిస్తుంది.

మైక్రోసాఫ్ట్ టీం AI- ఆధారిత ఫీచర్స్

మైక్రోసాఫ్ట్ టీం AI- ఆధారిత ఫీచర్స్

మైక్రోసాఫ్ట్ టీం యొక్క AI- ఆధారిత ఫీచర్లలో ఆటోస్పాండర్లు, కోర్టానా ఇంటిగ్రేషన్ మరియు లైవ్ ఎమోజి ప్రతిచర్యలు వంటివి ఉన్నాయి. వినియోగదారులు వీడియోలను ఫిల్టర్ చేయగలరు మరియు ఫోకస్ స్థాయిలు మరియు లైటింగ్‌ను సర్దుబాటు చేయగలరు. సబ్-టైటిల్స్ లను నిజ సమయంలో అనువదించడానికి అనుమతించే క్రొత్త ఫీచర్‌ను కంపెనీ ప్రకటించిలేదు.

Best Mobiles in India

Read more about:
English summary
Microsoft Teams New Update: 20,000 Members Allow in Meeting

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X