మార్కెట్లోకి ‘IndusInd Mobikwik’ వాలెట్

ప్రముఖ మొబైల్ వాలెట్ కంపెనీ మొబిక్‌విక్, ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌ఇండ్ భాగస్వామ్యంతో ‘IndusInd Mobikwik’ కో-బ్రాండెడ్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

ప్రముఖ మొబైల్ వాలెట్ కంపెనీ మొబిక్‌విక్, ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌ఇండ్ భాగస్వామ్యంతో 'IndusInd Mobikwik’ కో-బ్రాండెడ్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాలెట్ ద్వారా ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖతాదారులు మొబిక్‌విక్ మర్చెంట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని 'Direct Debit Feature' ద్వారా చెల్లింపులు చేపట్టే వీలుంటుంది.

 
Mobikwik join hands with IndusInd Bank for co-branded wallet

ఈ వాలెట్‌లోని డెరెక్ట్ డెబిట్ ఫీచర్ ద్వారా ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖతాదారులు ముందుగా తమ అకౌంట్‌లను యాప్‌తో లింక్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాతి నంచి నేరుగా వాలెట్ నుంచే చెల్లింపులు చేసుకునే వీలుంటుంది. వాలెట్‌లో ప్రతిసారి డబ్బులు లోడ్ చేసుకోవల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్‌తోనే వాలెట్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది.

 

ఆఫర్ అలర్ట్ : గెలాక్సీ ఎస్7పై రూ. 16 వేల తగ్గింపుఆఫర్ అలర్ట్ : గెలాక్సీ ఎస్7పై రూ. 16 వేల తగ్గింపు

ప్రైవేట్ సెక్టార్ లెండర్ అయిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ సెప్టంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 1250 బ్రాంచ్ లతో పాటు 2,146 ఏటీఎమ్ సెంటర్‌లను కలిగి ఉంది. ఈ స్పెషల్ మొబిక్‌విక్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతాదారులు డిజిటల్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించకునే వీలుంటుందని మొబిక్‌విక్ సహవ్యవస్థాపకులు ఉపాసనా టాకు తెలిపారు.

మార్కెట్లోకి Huawei కొత్త స్మార్ట్‌వాచ్మార్కెట్లోకి Huawei కొత్త స్మార్ట్‌వాచ్

ఆన్‌లైన్ మొబైల్ పేమెంట్స్ విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతోన్న మొబిక్‌విక్‌కు దేశవ్యాప్తంగా 20 లక్షల డైరెక్ట్ మర్చెంట్స్ ఉన్నాయి. ఈ యాప్‌ను వినియోగించుకునే వారి సంఖ్య 6.5 కోట్లకు పైగా ఉంది.

MobiKwik గురించి క్లుప్తంగా..

మొబిక్‌విక్ మొబైల్ వాలెట్ అనేది స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం డిజైన్ చేసిన ప్రత్యేకమైన ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం. ఈ యాప్ ఆఫర్ చేసే వాలెట్‌లో యూజర్లు తమ నగదును స్టోర్ చేసుకోవచ్చు. ఈ నగదుతో మొబైల్ రీఛార్జులు, డీటీహెచ్ రీఛార్జులు, యుటిలిటీ బిల్స్ ఇంకా షాపింగ్ కూడా చేయవచ్చు. యూజర్ తన డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని వాలెట్‌లో డబ్బును యాడ్ చేసుకోవల్సి ఉంటుంది.

నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !

టెక్నాలజీ పరంగా మరింత ముందంజలో ఉన్న పలు దేశాల్లో డిజిటల్ చెల్లింపు వినియోగం ఇప్పటికే విస్తరించింది. అభివృద్థి చెందుతోన్న దేశాల్లో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. డిజిటల్ వాలెట్స్ ఎన్‌క్క్రిప్షన్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తాయి.

Best Mobiles in India

English summary
The transaction is authorized with an additional factor of authentication, in line with mobile banking guidelines.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X