2 రోజుల్లో 20 లక్షల డౌన్‌లోడ్స్

మొబైల్ వాలెట్స్‌కు రోజురోజుకు డిమాంగ్ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రముఖ మొబైల్ పేమెంట్స్ యాప్ MobiKwik స్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లోనూ ఉపయోగించుకునే విధంగా లైట్ వర్షన్ మొబిక్‌విక్ యాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More :

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు రోజుల్లో 20 లక్షల డౌన్‌లోడ్స్

భారీ డిమాండ్ నేపథ్యంలో, కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ యాప్‌ను 20 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు మొబిక్‌విక్ వెల్లడించింది. గంట గంటకు ఈ సంఖ్య పెరుగుతోన్నట్లు సంస్థ తెలిపింది. కేవలం 1ఎంబీ సైజులో ఉండే మొబీవిక్ లైట్ వర్షన్ యాప్‌ను స్లో ఇంటర్నెట్‌లోనూ ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

త్వరలో ఎస్ఎంఎస్ లావాదేవీలు..

భవిష్యత్‌లో ఇంటర్నెట్ అవసరమే లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా నగదు లావాదేవీలను జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తామని మొబిక్‌విక్ చెబుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

త్వరలో ప్రాంతీ భాషల్లో కూడా..

ప్రస్తుతానికి మొబిక్‌విక్ లైట్ వర్షన్ యాప్ హిందీతో పాటు ఇంగ్లీష్ భాషలను సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే మరిన్ని ప్రాంతీయ భాషలను యాడ్ చేయనున్నట్లు మొబీవిక్ తెలిపింది. ఆండ్రాయిడ్ వీ2.3 ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలను మొబీవిక్ యాప్ సపోర్ట్ చేస్తుంది.

MobiKwik గురించి క్లుప్తంగా..

మొబిక్‌విక్ మొబైల్ వాలెట్ అనేది స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం డిజైన్ చేసిన ప్రత్యేకమైన ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం. ఈ యాప్ ఆఫర్ చేసే వాలెట్‌లో యూజర్లు తమ నగదును స్టోర్ చేసుకోవచ్చు. ఈ నగదుతో మొబైల్ రీఛార్జులు, డీటీహెచ్ రీఛార్జులు, యుటిలిటీ బిల్స్ ఇంకా షాపింగ్ కూడా చేయవచ్చు. యూజర్ తన డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని వాలెట్‌లో డబ్బును యాడ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
MobiKwik Lite registers over 20 lakh downloads in 2 days. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot