మొబీక్విక్‌తో జాగ్రత్త, భారీగా అక్రమాలు వెలుగులోకి..
డిజిటల్ పేమెంట్స్ సంస్థ అలాగే మొబైల్ వాలెట్ రంగంలో దూసుకుపోతున్న కంపెనీ మొబిక్విక్‌కు కొంతమంది వ్యక్తులు షాకిచ్చారు.
డిజిటల్ పేమెంట్స్ సంస్థ అలాగే మొబైల్ వాలెట్ రంగంలో దూసుకుపోతున్న కంపెనీ మొబిక్విక్‌కు కొంతమంది వ్యక్తులు షాకిచ్చారు. డిజిటల్ తప్పిదాన్ని అవకాశంగా తీసుకున్న వారు కంపెనీని భారీ నష్టాల్లోకి నెట్టివేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో చోటు చేసుకున్న అక్రమాల కారణంగా మోబిక్విక్ గత మూడున్నర నెలల కాలంలో మొత్తం రు. 19.61 కోట్లు నష్టపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా అక్రమాలు చోటుచేసుకున్నాయని కంపెనీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గుర్‌గావ్‌లో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టెక్నికల్ తప్పిదాన్ని అవకాశంగా తీసుకొని..
టెక్నికల్ తప్పిదాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది వ్యక్తులు తమ డబ్బులను వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారని మొబీక్విక్ న్యాయవాది లోకేశ్ రాజపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ ఖాతాదారుల విలువైన సమాచారం
అయితే తమ ఖాతాదారుల విలువైన సమాచారం, డబ్బు సురక్షితంగా ఉందని మొబీక్విక్ పేర్కొంది. రికార్డులను, ఖాతాలను స్కాన్ చేసిన తర్వాత భారీ మోసం జరగిందని కనుగొన్నప్పటికీ ..డబ్బు ఎలా పోయిందో మాత్రం గుర్తించలేకపోయింది.

రూ. 19 కోట్ల మేరకు..
రూ. 19 కోట్ల మేరకు మోసం చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని గుర్‌గావ్ సైబర్ క్రైమ్ సెల్ చైర్మన్ ఆనంద్ యాదవ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందనీ, అంతర్గత సిబ్బంది ప్రమేయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

మొబైల్ రీచార్జ్ తోపాటు..
కాగా మొబైల్ రీచార్జ్ తోపాటు, బిల్ చెల్లింపులు, షాపింగ్, వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ లాంటి వాటికోసం మొబీక్విక్ వాలెట్ ఉపయోగించవచ్చు.

ఒకవైపు డిజిటల్ ఎకానమీవైపు పరుగులు పెడుతోంటే
దేశం ఒకవైపు డిజిటల్ ఎకానమీవైపు పరుగులు పెడుతోంటే.. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ లావాదేవీ కంపెనీల హ్యాకింగ్ వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.


Click it and Unblock the Notifications