వేరు వేరు డిజిటల్ వాలెట్స్ మధ్య నగదు బదిలీ సాధ్యమే!

|

పేటీఎమ్, మొబిక్‌విక్, పోన్‌పే వంటి డిజిటల్ వాలెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డబ్బు పై ఆధారపడటం అనేది దాదాపుగా తగ్గిపోయింది. నగదు ట్రాన్సఫర్స్ దగ్గర నుంచి మొబైల్ రీఛార్జుల వరకు అన్ని రకాల చెల్లింపులు డిజిటల్ వాలెట్స్ ద్వారా చకచకా జరిగిపోతున్నాయి. డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఆయా వాలెట్స్ ఆఫర్ చేస్తోన్న క్యాష్ బ్యాక్స్ యూజర్లకు మరింత లబ్ధి చేకూరుస్తున్నాయి. డిజిటెల్ వాలెట్లకు సంబంధించి ప్రస్తుత ట్రెండ్‌ను మనం పరిశీలించినట్లయితే రెండు వేరువేరు డిజిటల్ వాలెట్‌ల మధ్య లావాదేవీలను నిర్వహించుకోవటమనేది చాలా కష్టమైన ప్రాసెస్‌గా మారిపోయిది. ఈ ప్రాసెస్ త్వరలో మారబోతోంది. డిజిటెల్ వాలెట్ల మధ్య లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ నూతన విధివిధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

 

OLXలో అమ్మకానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,విషయం ఏమిటి అంటే ?OLXలో అమ్మకానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,విషయం ఏమిటి అంటే ?

ఎకనమిక టైమ్స్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం...

ఎకనమిక టైమ్స్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం...

ఎకనమిక టైమ్స్ పోస్ట్ చేసిన ఓ కథనం ప్రకారం డిజిటల్ వాలెట్స్ మధ్య లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన రికమెండేషన్‌లను ఇప్పటికే విడుదల చేయగా వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది.

డిజిటల్ వాలెట్స్ వినియోగం మరింత సరళతరం...

డిజిటల్ వాలెట్స్ వినియోగం మరింత సరళతరం...

ఈ నూతన విధివిధానాలను అమలులోకి తీసుకురావటం వల్ల డిజిటల్ వాలెట్స్ వినియోగం మరింత సరళతరమవటంతో పాటు మరింత యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ పరంగా మరింత ముందంజలో ఉన్న పలు దేశాల్లో డిజిటల్ చెల్లింపు వినియోగం ఇప్పటికే విస్తరించింది.

బిల్ పేమెంట్స్ ఫీచర్‌ ద్వారా..
 

బిల్ పేమెంట్స్ ఫీచర్‌ ద్వారా..

అభివృద్థి చెందుతోన్న దేశాల్లో ఈ విధానం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. డిజిటల్ వాలెట్ యాప్స్‌లోని బిల్ పేమెంట్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఎలక్ట్రసిటీ బిల్స్ దగ్గర నుంచి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, డీటీహెచ్, బ్రాడ్ బ్యాండ్, గ్యాస్, వాటర్ ఇలా అన్ని రకాల బిల్లులను చెల్లించే వీలుంటుంది.

 

 

కేవైసీ-కంప్లీయెన్స్‌ కోసం ఆర్‌బిఐ ఆదేశాలు

కేవైసీ-కంప్లీయెన్స్‌ కోసం ఆర్‌బిఐ ఆదేశాలు

దేశవ్యాప్తంగా సేవలందిస్తోన్న డిజిటల్‌ వాలెట్లు ఫిబ్రవరి చివరిలోపు కేవైసీ-కంప్లీయెన్స్‌ను తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ వాలెట్ల కస్టమర్లందరూ 2017 డిసెంబర్‌ 31 వరకు కేవైసీ వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే తమ కేవైసీ వివరాలను సమర్పించారు. అయితే తక్కువ మంది మాత్రమే కేవైసీ వివరాలు సమర్పించడంతో, మిగతా యూజర్లను కోల్పోతామేమోనని డిజిటల్‌ వాలెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
We all would agree that the digital wallets such as Paytm, Mobikwik, and PhonePe have reduced the dependability of public on cash. These digital wallets allow a user to make payments or transfer money from one account to another with just a tap.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X