జియో నుంచి మరో దుమ్ము రేపే ఫీచర్..

By Hazarath
|

దిగ్గజాలకు షాకిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం మరో దుమ్మురేపే ఫీచర్‌తో ముందుకొచ్చింది. గూగుల్ అసిస్టెంట్ లాగా హల్లో జియో పేరుతో సరికొత్త ఫీచర్‌ని జోడించింది. అయితే ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్ పై ఓ లుక్కేయండి.

 

రూ. 5 వేల కోసం అడుక్కున్నా, నేను చేసిన పెద్ద తప్పు అక్కడ అడుగుపెట్టడమే : ఎయిర్‌టెల్ అధినేతరూ. 5 వేల కోసం అడుక్కున్నా, నేను చేసిన పెద్ద తప్పు అక్కడ అడుగుపెట్టడమే : ఎయిర్‌టెల్ అధినేత

హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్..

హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్..

మీరు జియో యాప్‌లో కెళ్లి అక్కడ అప్ డేట్లను పరిశీలించినట్లయితే అక్కడ మీకు హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది. ఇప్పటికే ఇది అందుబాటులో ఉంది కాబట్టి అప్‌డేట్ కొట్టాల్సి ఉంటుంది.

 జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్..

జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్..

మీ ఫోన్‌లో మై జియో యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, హల్లో జియో వాయిస్ అసిస్టెంట్‌లోకి వెళ్లిపోవచ్చు.

అండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను
 

అండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను

అండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను వాడుతూ రిలయన్స్ జియో సిమ్‌ని కలిగి ఉన్న వారు దీని అప్ డేట్ పొందవచ్చు. కాగా ఈ ఫీచర్ ఇప్పటికే జియో ఫోన్లలో అందుబాటులో ఉంది.

గూగుల్ అసిస్టెంట్స్‌లో మాదిరిగా..

గూగుల్ అసిస్టెంట్స్‌లో మాదిరిగా..

గూగుల్ అసిస్టెంట్స్‌లో మాదిరిగా దీనికి ఎలాంటి వాయిస్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన పనిలేదు. అయితే దీని ద్వారా కొన్ని పనులు మాత్రమే చేసేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్ రీచార్జ్ చేయమనీ, అకౌంట్ బ్యాలెన్స్ చూపించమనీ, ఇతరత్రా పనులను మాత్రమే హల్లో జియో సాయాన్ని కోరవచ్చు.

ప్రస్తుతానికి చాలా ప్రారంభ దశలో

ప్రస్తుతానికి చాలా ప్రారంభ దశలో

ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతానికి చాలా ప్రారంభ దశలో ఉంది. దీన్ని మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లీషు భాషలను ఇది సపోర్ట్ చేస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
MyJio App for Android Receives ‘HelloJio’ Voice Assistant Support; Understands Both Hindi and English Languages More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X