హైవేలపై ప్రయాణమా.. అయితే ఈ యాప్ గురించి తెలుసుకోండి..!
నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల ఓ యాప్‌ను లాంచ్ చేసింది. హైవేలపై నిత్యం ప్రయాణించే వారికి ఉపయోగపడేలా 'రాజ్‌మార్గ్‌యాత్ర' పేరుతో యాప్‌ను రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్, iOS ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ సేవలు అందిస్తుంది.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్.. జాతీయ రహదారుల సమస్త సమాచారం అందిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ప్రయాణం చేసుకోవచ్చని పేర్కొంది. దీంతోపాటు హైవేలపై ప్రయాణం చేసే వారికి ఉపయోగపడేలా ఈ యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయని తెలిపింది.

రాజమార్గయాత్ర యాప్ జాతీయ రహదారిపై పూర్తి సమాచారం ఇస్తుంది. వినియోగదారులు హైవే పై వాతావరణ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు పొందవచ్చు. దాంతోపాటు ప్రయాణికులు తమకు దగ్గరిలోని పెట్రోల్ పంపులు, టోల్ ప్లాజాలు, హాస్పిటల్‌లు, హోటల్ ఇతర అవసరమైన వివిరాలను పొందవచ్చు. ఫలితంగా ఎటువంటి అవస్థలు లేని ప్రయాణం చేయవచ్చు.
జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన రాజమార్గయాత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు. ఫిర్యాదులకు వీడియోలు, ఫోటోలను కూడా జతచేయవచ్చు. ఈ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదుల సకాలంలో పరిష్కరించబడతాయని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించబడకపోతే నేరుగా ఉన్నతాధికారులకు చేరుతాయి. వినియోగదారులు తన ఫిర్యాదుల స్థితిని కూడా నిరంతరం ట్రాకింగ్ చేయవచ్చు.
ప్రముఖ బ్యాంకుల భాగస్వా్మ్యంతో యాప్ నుంచి ఫాస్టాగ్ రీఛార్జ్‌లు, నెలవారీ ప్లాన్‌లు సహా ఇతర ఫాస్టాగ్ సంబంధిత సేవలను పొందవచ్చు. రాజమార్గయాత్ర యాప్ ఓవర్ స్పీడ్ సమయంలో అప్రమత్తం చేస్తుంది. మరియు రూట్ మ్యాప్ విషయంలో వాయిస్ అసిస్టెంట్‌తో సాయం చేస్తుంది.
ఈ యాప్‌లో ప్రయాణికులు భద్రత కోసం అత్యవసర సేవలకు సంబంధించిన నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. టోల్‌గేట్ల వద్ద సహా ఇతర ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే యూజర్లు ఈ యాప్‌ను ఎంత వరకు ఉపయోగిస్తారో చూడాల్సి ఉంటుంది. వారి ఫిర్యాదులు ఎంత వేగంగా పరిష్కారం అవుతాయో వేచిచూడాలి.
సాధారణంగా జాతీయ రహదారుల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో చాలా అవస్థలు పడుతుంటారు. పెట్రోల్ పంపులు, హాస్పిటల్, ఇతర అత్యవసర సేవలు ఎక్కుడ లభిస్తాయో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సమయాల్లో సాయం చేసేందుకు కూడా ఎవరూ అందుబాటులో లేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి యాప్‌లు చాలా వరకు ఉపయోగపడతాయి.
రాజమార్గయాత్ర యాప్‌లో ఫాస్టాగ్ సేవలు కూడా ఇందులో పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు టోల్ ప్లాజా సహా ఇతర వివరాలు, ఫిర్యాదులకు ఇది మంచి ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ యాప్ సాయంలో హైవేలపై ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








