Home
Apps

ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఫీచర్‌.. ఒక్క ట్యాప్‌తో ఫుల్ సీజన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..!

Netflix: వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది. అలాగే, iOS వినియోగదారుల కోసం కూడా ఎప్పటికప్పుడు ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అయితే ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు చాలా కాలం నుంచి ఒక ఫీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. అదేంటంటే, నెట్‌ఫ్లిక్స్‌లో తమకు ఇష్టమైన షోల సీజన్‌ మొత్తాన్ని ఒక్క ట్యాప్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. చివరికి నెట్‌ఫ్లిక్స్ ఆ ఫీచర్‌ను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది.

దానితో అన్ని ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవడం వారికి ఈజీ అయిపోనుంది. ఇంతకుముందు ఒక్కో ఎపిసోడ్‌ను విడివిడిగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది కదా, ఆ కష్టాలు ఇక ఉండవు. నిజానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఐఓఎస్ యూజర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చింది నెట్‌ఫ్లిక్స్.

Netflix Game-changer  Download Entire Seasons with Just ONE Tap on Your iPhone iPad

దీంతో ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు కూడా ఈజీగా తమ ఫేవరెట్ షోలను ఆఫ్‌లైన్‌లో చూడొచ్చు. షో పేజీలో షేర్ బటన్ పక్కనే కొత్తగా "సీజన్ డౌన్‌లోడ్" ఆప్షన్ కనిపిస్తుంది. అంతే, ఒక్క ట్యాప్ చేస్తే చాలు, సీజన్ మొత్తం మీ డివైజ్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈ ఫీచర్‌తో ఎవరికి ఉపయోగం, ఇది తీసుకురావాల్సిన అవసరమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇది ఎందుకంత స్పెషల్

ఈ ఫీచర్ ముఖ్యంగా ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్లకు, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేని ప్రాంతాల్లో ఉండేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నా, రోడ్డు మీద లాంగ్ డ్రైవ్ చేస్తున్నా, లేదా ఊర్లలో నెట్‌వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా... నచ్చిన సీజన్‌ను ముందే డౌన్‌లోడ్ చేసుకుంటే ఎంచక్కా ఆఫ్‌లైన్‌లో చూసేయొచ్చు.

నెట్‌ఫ్లిక్స్ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫీచర్‌ను 2016లోనే మొదలుపెట్టింది. ఆ తర్వాత స్మార్ట్ డౌన్‌లోడ్స్ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఇది మీరు చూసిన ఎపిసోడ్‌లను ఆటోమేటిక్‌గా డిలీట్ చేసి, తర్వాతి ఎపిసోడ్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన సీజన్ డౌన్‌లోడ్ ఫీచర్ మాత్రం అన్నింటికంటే అడ్వాన్స్‌డ్. ఒకేసారి మొత్తం సీజన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలి

ఫుల్-సీజన్ డౌన్‌లోడ్ ఫీచర్ ఇప్పుడు ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. దీన్ని వాడాలంటే ఫస్ట్ మీ నెట్‌ఫ్లిక్స్ యాప్‌ను యాప్ స్టోర్ నుంచి అప్‌డేట్ చేసుకోండి. తర్వాత మీకు ఇష్టమైన షో పేజీకి వెళ్లండి. అక్కడ షేర్ బటన్ పక్కనే "సీజన్ డౌన్‌లోడ్" బటన్ కనిపిస్తుంది.

దాని మీద ట్యాప్ చేస్తే చాలు మీ ఫేవరెట్ షోలను ఎంచక్కా ఆఫ్‌లైన్‌లో చూస్తూ ఎంజాయ్ చేయండి. టైమ్ పాస్ అవ్వడమే కాదు, డేటా కూడా సేవ్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన షోల లిస్ట్‌ను కూడా రిలీజ్ చేసింది. ఆ టాప్-5 షోస్ ఏవో చూద్దాం.

* మోస్ట్ డౌన్‌లోడెడ్ షోస్

అవి స్క్విడ్ గేమ్ (సీజన్ 1 & 2), మాన్‌స్టర్: ది జెఫ్రీ డాహ్మర్ స్టోరీ, వన్ పీస్, క్వీన్ చార్లెట్: ఎ బ్రిడ్జ్‌ర్టన్ స్టోరీ. ఈ లిస్ట్ చూస్తుంటేనే, ఈ షోస్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ ధరలు పెరిగాయి... కానీ ఇండియాలో మాత్రం పాత ధరలే ఉన్నాయి.

ఒకవైపు ఇలాంటి గుడ్ న్యూస్ చెబుతూనే, అమెరికా యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. అక్కడ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలను పెంచేసింది. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే ప్రీమియం (యాడ్-ఫ్రీ) నెలకు 24.99 డాలర్లు, స్టాండర్డ్ (యాడ్-ఫ్రీ) నెలకు 17.99 డాలర్లు, యాడ్-సపోర్టెడ్ ప్లాన్ నెలకు 7.99 డాలర్లు.

అయితే, యాడ్-ఫ్రీ ప్లాన్స్ తీసుకున్నవాళ్లు ఒక్కో డివైజ్‌లో 100 డౌన్‌లోడ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. యాడ్-సపోర్టెడ్ ప్లాన్ వాడేవాళ్లు మాత్రం నెలకి 15 డౌన్‌లోడ్స్‌కు మాత్రమే లిమిట్ ఉంటుంది. మన ఇండియా విషయానికి వస్తే, మనకు మాత్రం పాత ధరలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ధరలు పెంచే ఆలోచన లేనట్టున్నారు.

* ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్

మొబైల్ ప్లాన్ (రూ.149/నెలకు) 480p రిజల్యూషన్, ఒక డివైజ్. బేసిక్ ప్లాన్ (రూ.199/నెలకు) 720p రిజల్యూషన్, ఒక డివైజ్. స్టాండర్డ్ ప్లాన్ (రూ.499/నెలకు) 1080p రిజల్యూషన్, రెండు డివైజ్‌లు. ప్రీమియం ప్లాన్ (రూ.649/నెలకు) 4K, స్పేషియల్ ఆడియో, నాలుగు డివైజ్‌లు, ఏడు డివైజ్‌ల వరకు డౌన్‌లోడ్స్. ఇండియాలో ప్లాన్స్ ఎంత రీజనబుల్‌గానే ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Netflix introduced one-tap season downloads for iOS on iPhone and iPad, simplifying offline viewing. This is useful for travel and areas with limited internet. While US prices increased, Indian subscription costs remained unchanged.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X