Netflix StreamFest: మరో 48 గంటలు ఉచిత యాక్సిస్!! మిస్ అవ్వకండి...

|

ప్రపంచవ్యాప్తంగా ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ తన స్ట్రీమ్‌ఫెస్ట్‌ను పురస్కరించుకొని రెండు రోజులపాటు ఉచిత యాక్సిస్ ను అందించిన విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మరొక రెండు రోజుల పాటు ఈ ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మాత్రమే ఈ ప్రత్యేక స్ట్రీమ్‌ఫెస్ట్ ఈవెంట్‌ను నిర్వహించింది. కావున ఇండియాలో నివసించే ప్రజలు ఈ OTT యొక్క లైబ్రరీ ద్వారా కంటెంట్‌ను ఉచితంగా చూసే అవకాశంను ఇస్తున్నది. మొదటి స్ట్రీమ్‌ఫెస్ట్ డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 6 వరకు అందుబాటులో వచ్చింది. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ వినియోగదారులకు శుక్రవారం ఉదయం వరకు ఉచితంగా అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిసెంబర్ 11 ఉదయం వరకు నెట్‌ఫ్లిక్స్ ఉచిత యాక్సిస్

డిసెంబర్ 11 ఉదయం వరకు నెట్‌ఫ్లిక్స్ ఉచిత యాక్సిస్

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ ఇప్పుడు మళ్ళి 48 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. ఇది ఈ రోజు అంటే డిసెంబర్ 9, 9 AM నుండి ప్రారంభమైంది మరియు డిసెంబర్ 11, 8:59 AM వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్ట్రీమ్‌ఫెస్ట్ మరో రెండు రోజులు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే వినియోగదారులు స్టాండర్డ్ డెఫినేషన్ (SD) నాణ్యతలో మాత్రమే కంటెంట్‌ను ప్రసారం చేయగలరు. ఇది పూర్తిగా ఉచితం కాబట్టి ఇందులో ఫిర్యాదు చేయడానికి పెద్దగా ఏమీ లేదు. ఈ రెండు రోజుల తరువాత నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను HD కంటెంట్‌ను స్ట్రీమ్ చేయడానికి అనుమతిస్తుంది. కొన్ని సినిమాలు మరియు సిరీస్‌లు HD లో ఉచితంగా లభిస్తాయి.

నెట్‌ఫ్లిక్స్ యాక్సిస్ ఉచితంగా వీకెండ్ లో

నెట్‌ఫ్లిక్స్ యాక్సిస్ ఉచితంగా వీకెండ్ లో

దేశంలోని ప్రతిఒక్కరికీ నెట్‌ఫ్లిక్స్‌కు వారాంతంలో ఉచితంగా యాక్సిస్ ను ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇది క్రొత్త వ్యక్తులను ఆకట్టుకోవడానికి మరియు అద్భుతమైన స్టోరీలకు బహిర్గతం చేయడానికి గొప్ప మార్గం అని మేము భావిస్తున్నాము. నిజంగా ఒక ఈవెంట్‌ను సృష్టించి మరికొంతమంది వ్యక్తులను సైన్ అప్ చేసుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది అని నెట్‌ఫ్లిక్స్ COO గ్రెగ్ పీటర్స్ సంస్థ యొక్క Q3 2020 ఫలితాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లు
 

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లు

భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ యూజర్ బేస్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేక ప్రయోగాలలో 48 గంటల ఉచిత స్ట్రీమింగ్ ఆఫర్ ఒకటి. గత సంవత్సరం కంపెనీ ఇండియాలో తక్కువ-ధర వద్ద మొబైల్-ఓన్లీ ప్లాన్ ను పరీక్షించింది. తరువాత ఇది నెలకు రూ.199 ధర వద్ద నుండి మార్కెట్‌లో కోర్ సబ్‌స్క్రిప్షన్ మోడళ్లలో ఒకటిగా విలీనం చేయబడింది. స్ట్రీమ్‌ఫెస్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఎంత బాగా పనిచేస్తుందో చూడవలసి ఉంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో 1నెల ఉచిత ట్రయల్‌ను ఉపసంహరించుకుంది. దీనికి బదులుగా సైన్ అప్ చేసేటప్పుడు క్రొత్త సభ్యులు ఏదైనా క్రొత్త సబ్‌స్క్రిప్షన్ ను కొనుగోలు చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చెల్లింపు సభ్యత్వం ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఒక నెల ఉచితంగా ఇస్తుంది. ప్రస్తుత సభ్యులు వారు ఎంచుకున్న ప్రణాళిక ఆధారంగా నెలవారీ సభ్యత్వ ఛార్జీలు చెల్లించాలి.

Best Mobiles in India

English summary
Netflix StreamFest: Netflix Offers One More 48 Hours Free Access

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X