Home
Apps

HD Video క్వాలిటీతో నెట్‌ఫ్లిక్స్ మొబైల్, బేస్ ప్లాన్‌లు

భారతీయ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని నెట్‌ఫ్లిక్స్ తన చందాదారుల సంఖ్యను పెంచుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తోంది. అధిక జనాదరణను పొందిన ఈ స్ట్రీమింగ్ దిగ్గజం దాని రెండు బేస్ ప్లాన్‌లకు హెచ్‌డి వీడియో క్వాలిటీని జోడించనున్నది.

నెట్‌ఫ్లిక్స్ HD

నెట్‌ఫ్లిక్స్ HD

నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం రూ.199 ధర వద్ద ప్రారంభమయ్యే "మొబైల్" ప్లాన్‌కు మరియు రూ.499 ధర వద్ద ప్రారంభమయ్యే "బేస్" ప్లాన్‌ల రెండింటికి హై డెఫినిషన్ (HD) నాణ్యతను అప్‌గ్రేడ్ చేసి తీసుకువస్తున్నది. అప్‌గ్రేడ్ తరువాత వీడియో నాణ్యత ఇప్పుడు 720p గా ఉంది. గతంలో ఈ రెండు ప్లాన్‌లు 480p వీడియో నాణ్యతకు పరిమితం చేయబడ్డాయి.

 

 

నెట్‌ఫ్లిక్స్ 4K / UHD

నెట్‌ఫ్లిక్స్ 4K / UHD

నెట్‌ఫ్లిక్స్ యొక్క ఇతర ప్లాన్‌లు ప్రస్తుతానికి వాటి యొక్క వీడియో నాణ్యతను అలాగే కలిగి ఉన్నాయి. "స్టాండర్డ్" రూ.649 ప్లాన్ ఫుల్ హెచ్‌డి 1080p వీడియో క్వాలిటీని అందిస్తుంది. అలాగే "ప్రీమియం" రూ.799 ప్లాన్ టాప్ 4K / UHD వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఏదేమైనా అప్‌గ్రేడ్ చేయబడిన ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా యొక్క పరీక్షలో భాగమని గమనించండి.

 

 

నెట్‌ఫ్లిక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

నెట్‌ఫ్లిక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

ఇండియాలో ఫిబ్రవరి ఆరంభం నుండి మెరుగైన వీడియో నాణ్యత అందుబాటులో ఉందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఫీచర్ ను పరీక్షిస్తున్నట్లు స్ట్రీమింగ్ సంస్థ చెప్పినందున ఇది పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంది. "మేము ఎల్లప్పుడూ నెట్‌ఫ్లిక్స్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మరియు సభ్యులకు ఆనందించే మార్గాల కోసం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇది ఒక పరీక్ష మాత్రమే అని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి తెలిపారు.

 

 

మొబైల్ మరియు బేస్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లలో HD నాణ్యతను పొందడం ఎలా?

మొబైల్ మరియు బేస్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లలో HD నాణ్యతను పొందడం ఎలా?

నెట్‌ఫ్లిక్స్ అప్‌గ్రేడ్ చేసిన హై డెఫినిషన్ (HD) వీడియో క్వాలిటీ ప్లాన్‌లు భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. "మొబైల్" మరియు "బేసిక్" ప్లాన్‌లతో ఉన్న చందాదారులు తమ పరికరాల్లో 720p వీడియోలను యాక్సెస్ చేయవచ్చు.

 

HD వీడియో కంటెంట్‌

HD వీడియో కంటెంట్‌

కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు అయితే వారి పరికరాల్లో 720p వీడియోలను లోడ్ చేయడంలో సమస్యలు ఉంటాయి. అన్ని మొబైల్ ఫోన్లు HDకి సిద్ధంగా ఉన్నప్పటికీ చాలా బేస్ ఆండ్రాయిడ్ మొబైల్‌లు ధృవీకరణ సమస్యల కారణంగా HD వీడియో కంటెంట్‌ను ప్రసారం చేయలేవు.

 

*** గూగుల్ యొక్క వైడ్‌విన్ లెవెల్ 1 (L1) లోని ఆండ్రాయిడ్ ఫోన్‌లు మాత్రమే HD కంటెంట్‌ను ప్లే చేయడానికి అనుమతించబడతాయి. వైడ్‌విన్ లెవెల్ 3(L 3) లోని తక్కువ-స్థాయి పరికరాలు నెట్‌ఫ్లిక్స్ వీడియోలను HD లో ప్రసారం చేయలేవు.

నెట్‌ఫ్లిక్స్ మొదటి నెల ఆఫర్

నెట్‌ఫ్లిక్స్ మొదటి నెల ఆఫర్

నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా మొదటి నెల ఆఫర్ కోసం 5 రూపాయలను విడుదల చేసింది. ఒక వ్యక్తి మొబైల్ లేదా ప్రీమియం ప్లాన్‌ను ఎంచుకున్నాడా అనే దానితో సంబంధం లేకుండా కొత్త పరిచయ ఆఫర్ అన్ని ప్లాన్‌లతో లభిస్తుంది. రెండవ నెల నుండి సాధారణ చందాకు మారడానికి ముందు మొదటిసారి వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని పొందగలరు. సంస్థ ఇంతకుముందు తన మొదటిసారి వినియోగదారులందరికీ ఒక నెల సభ్యత్వాన్ని ఉచితంగా ఇచ్చింది.

 

 

Best Mobiles in India

English summary
Netflix Subscription Plans Now Provide HD Video Quality Services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X