వాట్స‌ప్‌లో చాలా మందికి తెలియ‌ని ఫీచర్స్ ఇవే....

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు.

By Anil
|

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు. అయితే చాలా మంది దీనిని కేవ‌లం మెసేజ్‌ల కోస‌మే వాడుతుంటారు. కానీ యూజర్ల సౌకర్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది.ఈ శీర్షిక లో భాగంగా వాట్సాప్ అందిస్తున్న 6 ఫీచర్లను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.

Forwarded Label....

Forwarded Label....

తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా ఈ Forwarded Label చాలా ఉపయోగపడుతుంది.వాట్సాప్‌లో యూజర్లు పెరుగుతున్నకొద్దీ సమాచారమూ పెరుగుతోంది. దాంతో పాటు తప్పుడు సమాచారం కూడా విచ్చ‌ల‌విడిగా వ్యాప్తి చెందుతోంది. దీన్ని నివారించడానికి మనదేశంలో వాట్సప్‌ ద్వారా ఫార్వర్డ్‌ చేసే మెసేజీల సంఖ్యపై పరిమితి విధిస్తామని వాట్సప్‌ ప్రకటించింది.

Mute Option......

Mute Option......

నోటీపికేషన్ బార్ లో రెండు షార్ట్ కట్స్ రాబోతున్నాయి. ఒకటి మెసేజ్ ఓపెన్ చేసి చదివేందుకు మరొకటి దాన్ని మ్యూట్ లో పెట్టుకునేందుకు అవకాశం కల్పించబోతోంది. వీటిని 50 మెసేజ్ ల పైన వస్తే ఉపయోగించవచ్చు.

Stickers....

Stickers....

WhatsApp Android beta version 2.18.218లో ఈ స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందరికీ వచ్చే అవకాశం ఉంది.

Suspicious Links Detection......
 

Suspicious Links Detection......

వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న ఫేక్‌ న్యూస్‌ అనలైజ్‌ చేసి, నిజమైన ఫేక్‌ న్యూస్‌ లింకులను గుర్తించడం ద్వారా వాటిని అరికడుతుందని సమాచారం. దీని ద్వారా మీకు వచ్చిన లింక్‌ ఫేక్‌ అని తెలిస్తే అది రెడ్‌ సిగల్‌ రూపంలో ఎర్రర్‌ చూపిస్తుంది.

Group admin controls....

Group admin controls....

ఈ ఫీచర్‌ ద్వారా ఎవరు పడితే వాళ్లు గ్రూపుల్లో పోస్టులు చేయలేరు. ఆయా గ్రూపులకు సంబంధించి అడ్మిన్‌ అప్రూవ్‌ చేసిన పోస్టులు మాత్రమే వాట్సప్‌లో పబ్లిష్‌ అవుతాయి.

Media Visibility....

Media Visibility....

ఈ వెర్షన్ Android version 2.18.194లో అందుబాటులో ఉంది. దీని ద్వారా యూజర్లు గ్యాలరీలో ఫోటోలు కనపడకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కనిపించే మూడు ఆప్సన్లు Default,' ‘Yes' and ‘Noను సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఈ ఫీచర్ పొందవచ్చు.

Best Mobiles in India

English summary
new features coming to WhatsApp.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X