మీ టికెట్ కన్‌ఫర్మ్‌ అవుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు

చాలామంది ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాక, వారి స్టేటస్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే వారి టిక్కెట్‌ అసలు కన్‌ఫర్మ్‌ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

|

చాలామంది ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాక, వారి స్టేటస్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే వారి టిక్కెట్‌ అసలు కన్‌ఫర్మ్‌ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ట్రైన్‌ టిక్కెట్లకు సంబంధించి చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా సరిగ్గా ఏవీ నిర్థారించం లేదు. అయితే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఓ యాప్‌ ఇప్పుడు ఈ విషయంలో ప్రయాణికులకు కాస్త ఊరటనిస్తోంది. దీని పేరు 'కన్‌ఫర్మ్‌టిక్కెట్‌'. ట్రైన్‌ టిక్కెట్లు కన్‌ఫర్మ్‌ అవుతాయో లేదో తెలీక ఇబ్బంది పడిన కొంత మంది వ్యక్తుల ఆలోచన ఇది. ఈ యాప్‌లోని లాగిన్‌ కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో ఆ ట్రైన్లకు సంబందించి టిక్కెట్‌ బుకింగులకు ఎంత ఛాన్స్‌ ఉందో శాతాల్లో చూపిస్తుంది. ఇప్పటివరకూ రోజుకు పదివేల బుకింగులను నమోదు చేస్తోందని యాప్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

వన్ ప్లస్ 6t మరో సంచలనం సృష్టించబోతుందా..?వన్ ప్లస్ 6t మరో సంచలనం సృష్టించబోతుందా..?

రైల్వే టికెట్ క్యాన్సిల్ ఛార్జీల వివరాలు, రైళ్ల రాకపోకల్లో మార్పులు తెలుసుకోండి

48 గంటల ముందు

48 గంటల ముందు

48 గంటల ముందు మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే IRCTC మీ టికెట్ మొత్తంలో నుంచి రూ. 240ను ఛార్జీల కింద వసూలు చేస్తుంది. AC first class, executive class టికెట్లకు ఈ ఛార్జీ వర్తిస్తుంది.

క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు

క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు

AC 2 tier/first class టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే రూ.200, AC 3 tier/AC chair car/ AC 3 Economyలకు అయితే రూ.180, sleeper classకు అయితే రూ.120, second classకు అయితే రూ.60 క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేయడం జరుగుతుందని IRCTC తెలిపింది.

ట్రైన్ బయలుదేరే 48 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 48 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 48 గంటల ముందు కాని 12 గంటల పైన కాని టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తంలో 25 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేస్తారు.

ట్రైన్ బయలుదేరే 12 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 12 గంటల ముందు

ట్రైన్ బయలుదేరే 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తంలో 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేస్తారు.

ప్యాసింజర్ ని బట్టి

ప్యాసింజర్ ని బట్టి

ఈ టికెట్ల మొత్తం ప్యాసింజర్ ని బట్టి, అతను బుక్ చేసుకున్న టికెట్లను బట్టి మారుతుంటాయని IRCTC తెలిపింది.

ఉచిత బీమా సౌకర్యం రద్దు

ఉచిత బీమా సౌకర్యం రద్దు

ఇదిలా ఉంటే రైలు ప్రయాణీకులకు రైల్వేశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటిసి) ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజా ప్రకటనలో తెలిపింది.

వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ..

వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ..

రైల్వే ప్రయాణికులు వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్‌ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం ..

ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం ..

అయితే ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం స్పష్టం చేయలేదు.కాగా, 2017 డిసెంబరు నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐఆర్సిటిసి ద్వారా రైల్వేశాఖ ఈ ఉచిత బీమాను తీసుకొచ్చింది.

బీమా వివరాలు

బీమా వివరాలు

రైలు ప్రయాణం సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు రూ. 10వేలు కూడా అందిస్తుంది.

రాకపోకల సమయాల్లో మార్పులు

రాకపోకల సమయాల్లో మార్పులు

దీంతో పాటుగా పలు రైళ్ల రాకపోకల సమయాల్లో భారత రైల్వే మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త సమయ పట్టిక ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

301 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

301 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

మొత్తం 301 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కువగా ఉత్తరాదిలో నడిచే రైళ్ల సమయ పట్టికలో ఈ మార్పులు చేశారు. ఈ రైళ్ల రాకపోకల సమయాల్లో చేసిన మార్పు..ఐదు నిమిషాల నుంచి రెండున్నర గంటల పాటు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కొత్త సమయ పట్టిక మేరకు

కొత్త సమయ పట్టిక మేరకు

కొత్త సమయ పట్టిక మేరకు 57 రైళ్లు బయలుదేరే సమయాన్ని మునుపటి కంటే ముందుకు జరపగా...58 రైళ్లు మునుపటి కంటే ఆలస్యంగా బయలుదేరి వెళ్లనున్నాయి.అలాగే 102 రైళ్లు మునుపటి కంటే ముందే గమ్య స్థానాలకు చేరుకోనుండగా...84 రైళ్లు మునుపటి కంటే ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుకుంటాయి.

రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు

రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు

ఇప్పటికే టికెట్లను రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు...ఈ రాకపోకల సమయాల్లో మార్పులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

రైళ్ల జాబితాలో ..

రైళ్ల జాబితాలో ..

రాకపోకలు మార్పులు చేసిన రైళ్ల జాబితాలో అమృతసర్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇవి మునుపటి సమయం కంటే ఐదు నిమిషాలు ముందే బయలుదేరి వెళ్లనున్నాయి

రైళ్ల జాబితాలో..

రైళ్ల జాబితాలో..

అలాగే డెహ్రాడూన్-అమృతసర్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు మునుపటి సమయం కంటే ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుకుంటాయి.

Best Mobiles in India

English summary
New railway app to tell if wait-listed ticket could get confirmed more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X