ఐఫోన్ యూజర్లకు వాట్సప్‌ సరికొత్త అప్‌డేట్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడంటే ?

మెసేజింగ్ రంగంలో ఎవ్వరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఐఫోన్ యూజర్లకు సరికొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది.

By Hazarath
|

మెసేజింగ్ రంగంలో ఎవ్వరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఐఫోన్ యూజర్లకు సరికొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. ఇకపై వాట్సప్ లో షేర్ అయిన యూ ట్యూబ్ వీడియోల కోసం మీరు బయటకు వెళ్లనవసరం లేకుండా మెసేజింగ్‌ యాప్‌ లోపలే యూట్యూబ్‌ వీడియోలను ప్లే చేసుకునేలా ఐఓఎస్‌ యూజర్లకు కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు వాట్సప్ లోనే యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చు.

ఈ ట్రిక్‌తో 7 నిమిషాల తరువాత కూడా వాట్సాప్ మెసెజ్‌లను డిలీట్ చేసేుకోవచ్చుఈ ట్రిక్‌తో 7 నిమిషాల తరువాత కూడా వాట్సాప్ మెసెజ్‌లను డిలీట్ చేసేుకోవచ్చు

యూట్యూబ్‌ లింక్‌ను వాట్సప్‌కు పంపిస్తే..

యూట్యూబ్‌ లింక్‌ను వాట్సప్‌కు పంపిస్తే..

ఇప్పటిదాకా మీ స్నేహితులు ఎవరైనా యూట్యూబ్‌ లింక్‌ను వాట్సప్‌కు పంపిస్తే వాటిని ఓపెన్ చేయడానికి వాట్సప్ నుంచి బయటకు రావాల్సి వచ్చేది. ఇకపై మెసేజింగ్‌ యాప్‌ నుంచి బయటికి వచ్చి ఆ వీడియోను చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్‌లోనే ఒక విండోలో ఆ యూట్యూబ్‌ క్లిప్‌ను ప్లే చేసుకోవచ్చు.

 వాట్సప్‌ వెర్షన్‌ను 2.18.11కు అప్‌డేట్‌ ..

వాట్సప్‌ వెర్షన్‌ను 2.18.11కు అప్‌డేట్‌ ..

డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం ఈ కొత్త ఫీచర్‌ కోసం ఐఓఎస్‌ యూజర్లు తమ వాట్సప్‌ వెర్షన్‌ను 2.18.11కు అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిసింది. ఈ ఫీచర్‌ను యాక్టివేషన్‌ చేసుకున్న అనంతరం బగ్‌ పరిష్కారాలను, సాధారణ మెరుగుదలను అందిస్తుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో పేర్కొంది. కేవలం ఆ వర్షన్ లోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉందని తెలిపింది.

వాట్సప్‌లోనే యూట్యూబ్‌ వీడియోను

వాట్సప్‌లోనే యూట్యూబ్‌ వీడియోను

ఈ ఫీచర్లో యూజర్లు వాట్సప్‌లోనే యూట్యూబ్‌ వీడియోను చూడటంతో పాటు వెంటనే యూజర్లు ఆ యూఆర్‌ఎల్‌ లింక్‌ చాట్‌లో షేరు చేయడం వంటి పనులను కూడా తేలికగా చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లు చాట్‌ను మార్చినప్పటికీ, వీడియో ఆగిపోదని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది.

వాట్సప్‌‌లో వచ్చిన యూట్యూబ్‌ వీడియోను..

వాట్సప్‌‌లో వచ్చిన యూట్యూబ్‌ వీడియోను..

అంతకముందు వాట్సప్‌‌లో వచ్చిన యూట్యూబ్‌ వీడియోను యూజర్లు క్లిక్‌ చేస్తే, అది స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న యూట్యూబ్‌ యాప్‌లో ఓపెన్‌ అయ్యేది. దీంతో వినియోగదారులు రెండు లింకులును ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి అవసరం లేదు.

ఆండ్రాయిడ్‌, విండోస్ యూజర్లకు..

ఆండ్రాయిడ్‌, విండోస్ యూజర్లకు..

అయితే ఆండ్రాయిడ్‌, విండోస్ యూజర్లకు కూడా ఈ అప్‌డేట్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 1.2 బిలియన్‌ యూజర్లున్నారు. ఇటీవల తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Best Mobiles in India

English summary
New update allows iPhone users to watch YouTube videos within WhatsApp More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X