కోడింగ్ అవసరంలేదు, కేవలం 20 నిమిషాల్లో యాప్ తయారు చేయండి!

స్మార్ట్‌ఫోన్‌లకు సమీప బంధువుల్లా పుట్టుకొచ్చిన యాప్స్ మనందరి జీవితాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కమ్యూనికేషన్ అసవరాల దగ్గర నుంచి హోమ్ మేనేజ్‌మెంట్ వరకు, షాపింగ్ దగ్గర నుంచి బ్యాంకింగ్ లావాదేవీలను వరకు చాలా వరకు మన రోజువారి కార్యకలాపాలను యాప్స్ ద్వారా తీర్చుకోగలుగుతున్నాం.

Read More : Pokemon Go ఇండియాలో లాంచ్ అయ్యింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజిటల్ జనరేషన్ వైపు..

ప్రపంచమంతా డిజిటల్ జనరేషన్ వైపు నడుస్తోన్న నేపథ్యంలో ఏదైనా వ్యాపారం క్లిక్ అవ్వాలంటే ముందుగా ఇంటర్నెట్‌లో పాపులర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో ఏ వ్యాపారం చేయాలన్న ఓ వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా అత్యవసరమైపోయింది. యాప్ ఆధారంగా ఆయా వ్యాపారాలకు క్రేజ్ లభించే పరిస్థితి నెలకుంది.

Appy Pie క్లౌడ్ బేసిడ్ మొబైల్ యాప్ బిల్డర్

న్నచిన్న వ్యాపారస్తులు సొంతంగా యాప్ ను తయారు చేయించుకోవాలంటే బోలెడంత డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి Appy Pie అనే క్లౌడ్ బేసిడ్ మొబైల్ యాప్ బిల్డర్ సాఫ్ట్‌వేర్ ఓ వరంలా దొరికిందనే చెప్పాలి. ఈ ఆన్‌లైన్ సొల్యూషన్ ద్వారా ఏ విధమైన కోడింగ్ అవసరం లేకుండా, మీకు కావల్సిన యాప్‌ను అభివృద్థి చేసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTML పరిజ్ఞానం అవసరం లేదు...

ఏ విధమైన HTML పరిజ్ఞానం అవసరం లేకుండానే Appy Pie వెబ్‌సైట్ ద్వారా మీకు కావల్సిన అప్లకేషన్‌ను తయారు చేసుకునే వీలుంటుంది. ఆ ప్రాసెస్‌ను ఇప్పుడు చూద్దాం..

స్టెప్ 1

ముందుగా Appy Pie website వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్ హోమ్ పేజీలో Create Youre Free App పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2

Create Youre Free App ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే తదుపరి మెనూలోకి వెళతారు. అక్కడ మీ యాప్‌కు సంబంధించిన పేరు, క్యాటగిరి వంటి వివరాలను ఎంటర్ చేసి అదే మెనూలోని "Next" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యాప్‌కు సంబంధించిన డెమోను చూపించటం జరుగుతుంది.

స్టెప్ 3

మీ యాప్‌కు రకరకాల థీమ్‌లను సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని Appy Pie సైట్ మీకు కల్పిస్తుంది. తదుపరి చర్యలో భాగంగా మీ యాప్‌కు సంబంధించిన డిస్క్రిప్షన్, about us, కాంటాక్ట్ డిటేల్స్, ఫోటోస్ వంటివి మీ యాప్ పేజీలో ఎంటర్ చేయవల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సెట్టింగ్స్ ద్వారా  ఐకాన్, ఫాంట్, స్టైల్, కలర్ వంటి సెట్టింగ్స్‌ను కస్టమైజ్ చేసుకోండి.

స్టెప్ 4

అన్ని వివరాలను ఎంటర్ చేసిన తరువాత "Build" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, ఈమెయిల్ వంటి వివరాలను ఎంటర్ చేసిన Sign Up కావల్సి ఉంటుంది. ఫ్రీ సర్వీసును పొందే క్రమంలో "Free" బటన్ పై టాప్ చేయండి.

స్టెప్ 5

మీ యాప్ విజయవంతంగా క్రియేట్ అయిన వెంటనే డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి, యాప్ ఎలా కనిపిస్తుందో చూసుకునే వీలుంటుంది. మీ తయారు చేసిన యాప్ లైవ్‌లోకి రావటానికి 2 గంటల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఎవరైనా సరే మీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
No Coding Needed! You Can Now Build Your Own App For Free in Just 20 Minutes. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot