నోకియా 6 (2018) పై రూ.1500 తగ్గింపు!

ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన నోకియా 6 (2018) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రూ.1500 ధర తగ్గింపును హెచ్‌ఎండి గ్లోబల్ అనౌన్స్ చేసింది.

By Gizbot Bureau
|

ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన నోకియా 6 (2018) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రూ.1500 ధర తగ్గింపును హెచ్‌ఎండి గ్లోబల్ అనౌన్స్ చేసింది. నోకియా 6 (2018) స్మార్ట్‌ఫోన్‌ను నోకియా 6.1 అని కూడా పిలుస్తారు. ఈ డివైస్ మొత్తం రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఇందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ ఆప్షన్‌తోనూ లభ్యమవుతోంది.

 

వీటి ధరలను పరిశీలించినట్లయితే ...

వీటి ధరలను పరిశీలించినట్లయితే ...

ధర తగ్గింపుకు ముందు నోకియా 6 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండేది. ప్రైస్ కట్ తరువాత రూ.1500 తగ్గింపుతో రూ.15,499కే లభ్యమవుతోంది. ఇదే నోకియా 6 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉండేది. ధర తగ్గింపు తరువాత రూ.17,499 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. నోకియా మొబైల్ షాప్‌తో పాటు అమెజాన్.ఇన్ అలానే ఫ్లిప్‌కార్ట్‌లు ఈ డివైస్‌ను విక్రయిస్తున్నాయి.

నోకియా 6 (2018) స్పెసిఫికేషన్స్..

నోకియా 6 (2018) స్పెసిఫికేషన్స్..

5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1920 x 1080 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ VoLTE, వై-ఫై (802.11 b/g/n), బ్లుటూత్ 5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో.

నోకియా 6.1 ప్లస్ విడుదల నేపథ్యంలో..
 

నోకియా 6.1 ప్లస్ విడుదల నేపథ్యంలో..

నోకియా 6.1 ప్లస్ విడుదల నేపథ్యంలోనే నోకియా 6 (2018) పై ధర తగ్గింపును హెచ్‌ఎండి గ్లోబల్ అనౌన్స్ చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నోకియా 6.1 ప్లస్ ఆగష్టు 21న ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్‌ను నోకియా ఎక్స్6కు గ్లోబల్ వేరియంట్‌గా భావిస్తున్నారు.

 

 

నోకియా 6.1 ప్లస్ స్పెసిఫికేషన్స్..

నోకియా 6.1 ప్లస్ స్పెసిఫికేషన్స్..

5.8 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (1080x2280పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గిరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ 636 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలీజీ సపోర్ట్, Bothie మోడ్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 147.2x70.98x7.99 మిల్లీ మీటర్లు.

 

 

 

Best Mobiles in India

English summary
Nokia 6.1 Gets a Price Cut in India Ahead of Nokia 6.1 Plus Launch.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X