నోకియా స్నేక్ గేమ్ ఇప్పుడు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో

నోకియా బ్రాండెడ్ మొబైల్ ఫోన్‌లను తిరిగి మార్కెట్లోకి పరిచయం చేసి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన HMD Global మరో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. నోకియా పరిచయం చేసిన ఐకానిక్ గేమ్‌లలో ఒకటైన Snake gameను ఫేస్‌బుక్ మెసెంజర్‌‌‌లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ తెలిపింది. ఫేస్‌బుక్ ఇన్‌స్టెంట్ గేమ్స్ క్రాస్-ప్లాట్ ఫామ్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో భాగంగా ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది.

Read More : మార్చి 15నే మోటో జీ5 రిలీజ్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

40 కోట్ల ఫోన్‌లలో..

1990 తరువాత విడుదలైన దాదాపు అన్ని నోకియా ఫోన్‌లలో స్నేక్ గేమ్ ఉంటుంది. దాదాపుగా 40 కోట్ల ఫోన్‌లలో ఈ గేమ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించటం జరిగిందని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది.

ఒరిజినల్ స్నేక్ గేమ్ తరహాలోనే

ఒరిజినల్ స్నేక్ గేమ్ తరహాలోనే కొత్త వర్షన్ స్నేక్ గేమ్‌లోనూ పామును స్ర్కీన్ చుట్టూ మూవ్ చేస్తుండాలి. ఇదే సమయంలో యాపిల్స్ అలానే బగ్స్‌ను తింటూ స్కోరును పెంచుకోవల్సి ఉంటుంది.

గేమ్‌లో 6 లెవల్స్

మొత్తం గేమ్‌లో 6 లెవల్స్ ఉంటాయి. ఆటలోని పాము ఒక్కో లెవల్‌లో ఒక్కో విధమైన లేఅవుట్‌లో కనిపిస్తుంది. మూడు రకాల స్పీడ్ లలో గేమ్ అందుబాటులో ఉంటుంది. గేమర్స్ నచ్చిన స్పీడ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. హయ్యిర్ స్పీడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా వేగంగా స్కోర్ చేసే వీలుంటుంది. ఎక్కువ స్కోర్‌ను నమోదు చేసి లీడర్ బోర్డ్ పొజీషన్‌లలో ఎవరెవరు ముందున్నారో కూడా తెలుసుకునే వీలుంటుంది.

మెసెంజర్‌లో నోకియా స్నేక్ గేమ్‌ను ఆడటం ఎలా..?

ప్రస్తుతానికి ఫేస్‌బుక్ ఇన్‌స్టెంట్ గేమ్స్ క్రాస్-ప్లాట్ ఫామ్‌.. నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, గ్రేట్ బ్రిటన్, కెనడా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, లాట్వియా, జర్మనీ, ఐర్లాండ్, బెల్జియం, న్యూజిలాండ్, ఫ్రాన్స్, సింగపూర్, ఫిన్లాండ్, హాంగ్ కాంగ్, రష్యన్ ఫెడరేషన్, ఎస్టోనియా, తైవాన్, స్లోవేనియా, ప్యూర్టో రికో, సైప్రస్, ఇజ్రాయెల్, లిథువేనియా, స్పెయిన్ ఇంకా ఇటలీ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ ఇన్‌స్టెంట్ గేమ్స్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌లోకి అందుబాటులోకి తీసుకురాబోతోంది.

లెటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది

ఇన్‌స్టెంట్ గేమ్స్ క్రాస్-ప్లాట్ ఫామ్‌ సదుపాయాన్ని మెసెంజర్ యాప్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన వెంటనే యాప్‌ను లెటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia's Snake game now available on Facebook Messenger. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting