రేపటి నుంచి రోజూ మారే పెట్రోల్ ధరలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి

కొత్త ధరల విధానం అమల్లోకి రాబోతోన్న నేపథ్యంలో రేపటి నుంచి పెట్రోల్ ధరలు రోజుకో విధంగా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో రోజుకోసారి మారిపోయే పెట్రోల్ ధరలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), Fuel@IOC పేరుతో సరికొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది.

రేపటి నుంచి రోజూ మారే పెట్రోల్ ధరలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి

పెట్రోల్ ధరల గురించిన రోజువారీ అప్‌డేట్‌లను ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకువచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ ద్వారా యాప్‌ను పొందవచ్చు.

రేపటి నుంచి రోజూ మారే పెట్రోల్ ధరలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా ఈ ధరలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. ఒకవేళ ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్ ధరలను తెలుసుకోవాలను కుంటున్నట్లయితే RSP అని టైప్ కొద్దిగా స్పేస్ ఇచ్చి మీ డీలర్‌కోడ్‌ను ఎంటర్ చేసి 92249-92249కు ఎస్ఎంఎస్ చేయండి. రిప్లై రూపంలో మీకు పెట్రోల్ ధర పంపబడుతుంది. 

English summary
Now, check daily revision of fuel prices on this app. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting