మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారా..?

ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం యూట్యూబ్ (YouTube) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా ప్లే అవుతోన్న యూట్యూబ్ వీడియో పై 'Double Tap' ఇవ్వడం ద్వారా వీడియోను ఫార్వర్డ్ లేదా రీవైండ్ చేసుకునే వీలుంటుంది. వీడియోను ఫార్వర్డ్ చేయాలనుకునే వారు స్ర్కీన్ కుడి వైపు డబుల్ ట్యాప్ ఇవ్వటం ద్వారా ఆ వీడియో 10 సెకన్లు ముందుకు వెళుతుంది. వీడియోను రీవైండ్ చేయాలనుకునే వారు స్ర్కీన్ ఎడుమ వైపు డబుల్ ట్యాప్ ఇవ్వటం ద్వారా ఆ వీడియో 10 సెకన్లు వెనక్కు వెళుతుంది.

అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరింత సౌకర్యవంతంగా వీడియోలను చూడొచ్చు..

ఇప్పటి వరకు యూట్యూబ్ వీడియోలను ఫార్వర్డ్ లేదా రీవైండ్ చేసుకోవాలంటే scrubberను ఉపయోగించుకోవల్సి వస్తోంది. ఈ స్ర్కబ్బర్ ఫీచర్ పెద్ద స్ర్కీన్ డివైస్‌లకు అనువుగా ఉన్నప్పటికి, చిన్న స్ర్కీన్ డివైస్‌లకు అంతగా సెట్ కాలేదు. ముఖ్యంగా చిన్న తెరలను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఫీచర్ మరింత ఇబ్బందికరంగా మారింది. తాజాగా, అందుబాటులోకి వచ్చిన ఈ డబుల్ ట్యాప్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లలో ఈ సమస్య తొలగిపోనుంది.

‘Double Tap' ఫీచర్ ప్రస్తుతానికి..

The Next Web వెల్లడించిన వివరాల ప్రకారం.. యూట్యూబ్ తాజాగా పరిచయం చేసిన ‘Double Tap' ఫీచర్ ప్రస్తుతానికి అందరికి అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్ యూజర్లు యూట్యూబ్ వర్షన్ 12.01.55కు అప్‌గ్రేడ్ అవటం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. లేటెస్ట్ వర్షన్ యూట్యూబ్ యాప్‌లో యాపిల్ iOS యూజర్లు Play/Pause, Previous/Next, వాల్యుమ్ కంట్రోల్స్ వంటి ఆప్షన్స్‌ను నేరుగా లాక్ స్ర్కీన్ నుంచి యాక్సిస్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ గురించి ఆసక్తికర విషయాలు.

యూట్యూబ్ .. ఇదో వీడియో ప్రపంచం. ఈ వీడియో బ్లాగింగ్ ప్రపంచంలో ఏ అంశానికి సంబంధించిన వీడియో అయినా సరే టక్కున దొరికేస్తుంది. యూట్యూబ్ సైట్‌లో వీడియోలను చూడటం, షేర్ చేయటమే కాదు అప్‌లోడ్ కూడా చేయవచ్చు. యూట్యూబ్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫిబ్రవరి 25, 2005

యూట్యూబ్‌ను చాడ్ హుర్లీ, స్టీవెన్ చిన్, జావెద్ కరీమ్‌లు ప్రారంభించారు. వీళ్లు మాజీ PayPal ఉద్యోగులు. యూట్యూబ్ పేరుతో ఫిబ్రవరి 25, 2005న డొమైన్‌ను రిజిస్టర్ చేయించిన వీరు అదే సంవత్సరంలో డిసెంబర్‌లో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

గూగుల్ సొంతమైన వేళ...

నవంబర్ 2006లో యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

Broadcast Yourself

గూగుల్ తరువాత అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌గా యూట్యూబ్ అవతరించింది. "YouTube" అసలు ఉద్దేశ్యం "Broadcast Yourself"

1,800 సంవత్సరాల సమయం పడుతుందట...

యూట్యూబ్‌లో ఉన్న మొత్తం వీడియోలను ఇప్పటి నుంచి చూడటం మొదలుపెడితే అది పూర్తయ్యేసరికి మీకు 1,800 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 46,296 యూట్యూబ్ వీడియోలను వీక్షిస్తున్నారు.

అమెరికా అత్యధిక శాతం..

అమెరికాకు చెందిన అత్యధిక శాతం మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్ ను యూట్యూబ్ ప్రసారం చేస్తోంది

యూట్యూబ్ మొట్టమొదటి వీడియో..

యూట్యూబ్ సహవ్యవస్థాపకులు జావెడ్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. ఏప్రిల్ 23, 2005 సరిగ్గా ఆ రోజు సమయం రాత్రి 8.27 నిమిషాలు. యూట్యూబ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. 18 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ‘మీ ఎట్ ద జూ' ("Me at the zoo")గా నామకరణం చేసారు. కరీమ్ ఈ వీడియోను జావెద్ యూజర్ నేమ్ క్రింద అప్‌లోడ్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now Double Tap to forward and rewind videos on YouTube. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot