ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు యాప్ వచ్చేసింది..
ఈ యాప్ ద్వారా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వీలుంటుంది.
పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు శుభవార్త. ఇక పై మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు All India ITR మొబైల్ యాప్‌ను వినియోగించుకోండి. ఈ యాప్ ద్వారా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వీలుంటుంది.

ఇన్‌కమ్ టాక్స్ ఈ-ఫైలింగ్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ఆల్ ఇండియా ఐటీఆర్' (All India ITR) అనే వెబ్‌సైట్ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో వస్తోన్న ఈ యాప్‌లో అనేక ఆప్షన్‌లను పొందుపరిచారు.

ట్యాక్స్ రీఫండ్ స్టేటస్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంది, HRA మినహాయింపు, రెంట్ రిసిప్ట్స్ వంటి పన్ను సంబంధింత అంశాల పై ఈ యాప్ ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications