Home
Apps

విండోస్ 10లోనూ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు

ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకంగా అప్‌డేట్ చేసింది.

By Sivanjaneyulu Bommu

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకంగా అప్‌డేట్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ తరహాలోనే విండోస్ 10 డివైస్ ల్లోనూ మెసెంజర్ యాప్ ద్వారా వాయిస్ ఇంకా వీడియో కాల్స్ నిర్వహించుకునేందుకు వీలుంటుంది.

విండోస్ 10లోనూ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు

Read More : ఆన్‌లైన్‌లో, మీ ఏటీఎమ్ కార్డ్ పిన్ నెంబర్ మార్చటం ఎలా..?

ఈ సదుపాయం అందుబాటులోకి రాకముందుకు విండోస్ యూజర్లు Messenger.com లేదా Facebook.comలోకి వెళ్లి వాయిస్ లేదా వీడియో కాల్స్ చేసుకోవల్సి వచ్చేది. ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు..

మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు...

మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు...

అవును మీరు వింటున్నది నిజమే.. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను మీ డెస్క్‌టాప్ పై ట్రై చేసేందుకు క్లిక్ చేయండి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు

ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు

మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

Uber car సర్వీస్‌

Uber car సర్వీస్‌

మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..?

ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..?

మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

conversationను మ్యూట్ చేయాలంటే..?

conversationను మ్యూట్ చేయాలంటే..?

మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

 పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు

పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు

మెసెంజర్ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం భారత్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

 ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు

ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ మిత్రులకు ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు. యాప్‌లో పొందుపరిచిన ఫోటో మ్యాజిక్ ఫీచర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

 వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌

వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌

మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు.

లోకేషన్‌ కూడా షేర్ చేసుకోవచ్చు...

లోకేషన్‌ కూడా షేర్ చేసుకోవచ్చు...

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

Giphy, GIF keyboard

Giphy, GIF keyboard

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More from GizBot

Best Mobiles in India

English summary
Now make calls with Windows 10 Messenger app. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X