పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా..అయితే ఈ యాప్ వాడండి !

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెలువరించింది.

By Hazarath
|

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెలువరించింది. ప్రభుత్వం లాంచ్‌ చేసిన భీమ్‌ లేదా భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ యాప్‌ను ఇంధన చెల్లింపులకు వాడితే, లీటరు పెట్రోల్‌పై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్‌ ఇండియా అధికారిక అకౌంట్‌ ఈ ప్రకటన చేసింది.

హైపర్‌లూప్ అంతా ఓ మాయ, ఒళ్లు జలదరించే రహస్యాలు !హైపర్‌లూప్ అంతా ఓ మాయ, ఒళ్లు జలదరించే రహస్యాలు !

bhim

అంతేకాక బ్యాంకు కార్డులకు కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయట.మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్స్చేంజ్‌ డ్యూటీలను కోత పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ వచ్చే నెల దీపావళి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గబోతున్నాయంటూ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

కొత్త హంగులతో భీమ్ యాప్కొత్త హంగులతో భీమ్ యాప్

భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ..? ( స్టెప్ బై స్టెప్ ) తెలుసుకోండి.

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ట్‌లో కెళ్లి భీమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఐవోఎస్ యూజర్లకి అందుబాటులో లేదు.

స్టెప్ 2

స్టెప్ 2

అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత వెరిఫై ఫోన్ నంబర్ అడుగుతుంది. అది ఎసెమ్మెస్ రూపంలో వస్తుంది. అది పూర్తి కాగానే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు వస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

వెరిఫికేషన్ ఫూర్తి కాగానే మీకు 4 డిజిట్ పాస్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 4

స్టెప్ 4

పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మీరు ఏ బ్యాంకు నుంచి లావాదేవీలు జరపాలనుకుంటున్నారో ఆ బ్యాంకును సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. బ్యాంకును సెలక్ట్ చేసుకోగానే మీ ఫోన్ నంబర్ ద్వారా వివరాలను ఆటోమేటిగ్గా తీసుకుంటుంది. ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా మీరు అన్ని రకాల ట్రాన్సిక్షన్స్ చేసుకోవచ్చు.

స్టెప్ 5

స్టెప్ 5

యాప్‌లో మూడు రకాల ఆప్సన్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో సెండ్, రిక్వెస్ట్, స్కాన్ పే.. ఈ మూడు రకాల ఆప్సన్లలో మీకు కావాల్సినది సెలక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్ 6

స్టెప్ 6

సెండ్ ఆప్సన్‌లో మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో వారి ఫోన్ నంబర్ అలాగే ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అమౌంట్ అడుగుతుంది. దీంతో పాటు మీరు ముందు ఎంటర్ చేసిన పిన్ అడుగుతుంది. అవి ఎంటర్ చేయగానే అమౌంట్ ట్రాన్సిక్షన్ జరుగుతుంది.

స్టెప్ 7

స్టెప్ 7

అలాగే మీరు ఎవరికైనా అమౌంట్ రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే రిక్వెస్ట్ ఆప్సన్‌లో కెళ్లి మీరు ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఆలోమేటిగ్గా వారికి మీ రిక్వెస్ట్ చేరుతుంది. అయితే మీరు ఈ మూడు ఆప్సన్లలో ఏది యూజ్ చేయాలన్నా అవతలి వారు కూడా భీమ్ యాప్ లో లాగిన్ అయి ఉండాలి.

స్టెప్ 8

స్టెప్ 8

మూడో ఆప్సన్ బార్ కోడ్ స్కానర్. దీని ద్వారా కూడా అమౌంట్ పంపుకునే వీలు ఉంటుంది. మొబైల్లో గాని , ట్యాబ్లెట్‌లో గాని ఈ యాప్ ఉన్న వారి నుండి యాప్ ఓపెన్ స్కాన్ కోడ్ తీసుకుంటే మీరు ఆటోమేటిగ్గా డబ్బులు పంపుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Now, Pay Up To Rs 0.49/Litre Less On Fuel While Paying Via BHIM, Cards Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X