వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్, ఐఫోన్ యూజర్లకు మాత్రమే !

Written By:

సోషల్ మీడియా మార్కెట్లో దూసుకుపోతున్న వాట్సప్ ఐఫోన్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా వచ్చిన ఈ అప్‌డేట్‌లో యూట్యూబ్ వీడియోలను చాట్‌లోనే చూసుకొనే అవకాశాన్ని యూజర్లకు కలిగింది.ఈ ఫీచర్‌తో పాటు వాయిస్ రికార్డు కోసం ఆ బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ లాక్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

షియోమి Desh ka Smartphone, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియో ప్లే..

గతంలో ఓ కన్వర్జేషన్‌లో భాగంగా యూట్యూబ్ లింకు రిసీవ్ చేసుకున్నప్పుడు దానిపై క్లిక్ చేస్తే.. అది యూట్యూబ్ పేజ్‌లోకి వెళ్లేది. కానీ ఇప్పుడీ కొత్త ఫీచర్‌తో అక్కడే వీడియో ప్లే అవుతుంది.

చాట్ నుంచి మరో చాట్‌లోకి వెళ్లినా..

అంతేకాదు మీరు ఓ చాట్ నుంచి మరో చాట్‌లోకి వెళ్లినా.. వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. వాట్సప్ వీ2.17.81 అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్లు యాడ్ చేశారు. ఈ అప్‌డేట్‌ను తొలిసారి వాబీటాఇన్ఫో గుర్తించింది.

వాయిస్ రికార్డు చేయాలనుకున్నా

ఇక వాయిస్ రికార్డు చేయాలనుకున్నా కూడా ఆ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా లాక్ రికార్డింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. దానిపై స్వైప్ చేసి వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేయొచ్చు. దీనివల్ల పెద్ద పెద్ద వాయిస్ మెసేజ్‌లను ఈజీగా రికార్డు చేసే అవకాశం యూజర్లకు కలుగుతుంది.

రెండు ఫీచర్లతో పాటు మరో అద్భుతమైన ఫీచర్‌..

ఈ రెండు ఫీచర్లతో పాటు మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సప్ ప్రయత్నిస్తున్నది. అదేంటంటే.. ఓ వాయిస్ కాల్ చేస్తున్న సమయంలో అందులో మాట్లాడుకుంటూనే వీడియో కాల్‌కు మారిపోయే అవకాశం ఉంటుంది. అయితే అవతలి వ్యక్తి వద్దనుకుంటే ఈ వీడియో కాల్‌ను రిజక్ట్ చేయొచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు..

ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తున్నది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now, WhatsApp plays YouTube videos within app on iPhone Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot