Just In
- 1 hr ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 6 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 9 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
సుప్రీంకోర్టులో కీలక దశకు చేరిన అమరావతి
- Lifestyle
హస్త ప్రయోగం కోసం పండ్లు, కూరగాయలు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఈ అప్లికేషన్ సహాయంతో మీరే సొంతంగా ఎమోజీలను తయారుచేసుకోవచ్చు
టెక్ దిగ్గజం గూగుల్ తన జీ - బోర్డ్ కీబోర్డ్ అప్లికేషన్ కోసం, ఎమోజీల రూపంలో ఉన్న చిన్న చిన్న స్టిక్కర్లను విడుదల చేసింది. అంతేకాకుండా, వినియోగదారులు తమకు అనువైన విధంగా, తమ రూపాలలోనే ఎమోజీలను తయారుచేసుకునే సౌలభ్యాన్ని కూడా పొందుపరచింది.

జీ - బోర్డ్ లో సరికొత్త ఎమోజీ స్టిక్కర్లు :
కంపెనీ చెప్తున్న ప్రకారం, ఈ మినీ స్టిక్కర్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో కూడుకుని, మంచి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవిలా ఉంటాయని చెప్పబడింది. క్రమంగా వినియోగదారులు తమ సెల్ఫీలను ఉపయోగించుకుని ఎమోజీలను తయారుచేసుకునేలా వీలు కల్పించబడింది.

బిట్మోజీ అప్లికేషన్ సహకారం :
కాకపొతే, దీనికోసం జి - బోర్డ్, బిట్ స్ట్రిప్స్ సంస్థ వారి 4+ రేటింగ్ కలిగి ఉన్న, "బిట్మోజీ" అప్లికేషన్ సహాయం తీసుకుంది. ఈ బిట్మోజీ అప్లికేషన్లో సెల్ఫీలను ఎమోజీలుగా మార్చుకునే సౌలభ్యం కల్పించబడుతుంది. ఇక నుండి జి - బోర్డ్ ఈ బిట్మోజీ అప్లికేషన్ సహాయాన్ని తీసుకోనుంది. ఎమోజీ సెక్షన్లో, డీఫాల్ట్ గా ఇచ్చిన ఎమోజీల పక్కన "క్రియేట్ ఎమోజీ" ఆప్షన్ + సింబల్ కలిగి కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు, బిట్మోజీ సహాయంతో సెల్ఫీ తీసి, మీ సొంత ఎమోజీల రూపకల్పనకు కృషి చేస్తుంది. కావున మీ మొబైల్ నందు బిట్మోజీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయి ఉందని నిర్ధారించుకోండి.

ఎమోజీలలో రకాలు :
ఈ మినీ స్టిక్కర్స్ 2 భిన్నమైన రకాలలో లభ్యమవుతున్నాయి కూడా. ఎమోజీలకు అదనపు హంగులు జోడించాలి అనుకునే వారి కోసం "బోల్డ్", మరియు సాఫ్టర్ టచ్ ఇష్టపడే వారి కోసం "స్వీట్" అని రెండు రకాలలో ఎమోజీలను తయారు చేసుకునేందుకు వీలు కల్పించబడింది. మీ మీ అవసరాలను అనుసరించి మీ ఎంపికలు ఉండేలా.

ఎమోజీలను తయారుచేయండిలా :
సెల్ఫీ తీసుకున్న అనంతరం, "ఎమోజీస్ మినీ", గూగుల్ పొందుపరచిన న్యూరల్ నెట్వర్క్స్ అనే మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని స్కిన్ టోన్, హెయిర్ స్టైల్స్, ఫేషియల్ హెయిర్, హాట్స్, మరియు కళ్ళజోడు వంటి ఇతర ఉపకరణాలను ఎన్నుకోమని సూచిస్తుంది. క్రమంగా మీ రూపు రేఖలను అనుసరించి, మీ స్టైల్స్ మీరే నిర్ధారించుకోవచ్చు.

మీ డివైజులోకి ఎప్పుడు వస్తుంది :
గూగుల్ నెమ్మదిగా ఈ ఫీచర్ను అన్ని డివైజులలోకి రోల్-అవుట్ చేస్తూ ఉంది. క్రమంగా అన్ని ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ డివైజులకు త్వరలో పూర్తి స్థాయిలో రానున్నదని తెలిపింది.
ఇంకెందుకు ఆలస్యం, మీ డివైజులో ఫీచర్ ఉందేమో చెక్ చేసుకోండి. లేనిచో, జి - బోర్డ్ అప్డేట్ చేసుకుని, బిట్మోజీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి.

ఐఓఎస్ డివైజుల కోసం గూగుల్ యూనిఫైడ్ ఇన్ – బాక్స్ ఫీచర్ :
ఈమధ్యనే గూగుల్ ఐఓఎస్ డివైజుల కోసం, మల్టిపుల్ జీ - మెయిల్ అకౌంట్స్ వినియోగించుకొనుట కొరకు, యూనిఫైడ్ ఇన్-బాక్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. క్రమంగా ఇప్పటి నుండి ఐఓఎస్ వినియోగదారులు, జీ - మెయిల్ అకౌంట్స్ స్విచ్ చేసుకోవడం ద్వారా, రెండు అంతకన్నా ఎక్కువ జీ - మెయిల్ అకౌంట్స్ ఒకే సెక్షన్ నుండి వినియోగించుకునే సౌలభ్యం కలిగింది. ఈ అప్డేట్ తర్వాత, ఇన్ బాక్స్ ఎడమవైపు గల పానెల్ నందు, "all inboxes" ఎంచుకోవడం ద్వారా, అన్ని ఈ-మెయిల్స్ ఒకే చోట నుండి యాక్సెస్ చేసుకునే వీలు కలిగింది.

గూగుల్ చెప్పిన వివరాల ప్రకారం :
అధికారిక బ్లాగ్ నందు, కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, వృత్తిపరమైన లేదా పర్సనల్ మెయిల్ అకౌంట్స్, జీ - సూట్ లేదా జీ - సూట్ కాని అకౌంట్స్ (గూగుల్ ఆధారితం కానివి మరియు, ఇతర IMAP అకౌంట్స్) కూడా జీ - మెయిల్ ఐఓఎస్ అప్లికేషన్ నుండి యాక్సెస్ చేసుకునే సౌలభ్యం కల్పించబడింది అని పేర్కొంది. కానీ, మీరు అకౌంట్స్ యాక్సెస్ చేయడానికి, వేర్వేరు ఇన్-బాక్సులకు తరచూ మారవలసి ఉండేది. అయితే, మీ సమయాన్ని ఆదా చేసేందుకు వీలుగా జీ-మెయిల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వలె, ఒకే ఇన్-బాక్స్ ద్వారా అన్ని అకౌంట్ల మెయిల్స్ ఒకే సెక్షన్లో చూసేలా వీలు కల్పించబడుతుంది. అని తన అధికారిక బ్లాగ్లో పేర్కొంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470