ఇక గూగుల్ ఫోన్ యాప్ ద్వారా spam callsను ఫిల్టర్ చేసుకోవచ్చు

గత కొద్ది సంవత్సరాలుగా స్పామ్ కాల్స్ అనేవి మొబైల్ యూజర్లకు విసుగు తెప్పిస్తూనే ఉన్నాయి. వీటిని నివారించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం చర్యలు తీసుకుంటున్నప్పటికి సమస్య తగ్గుముఖం పట్టటం లేదు.

|

గత కొద్ది సంవత్సరాలుగా స్పామ్ కాల్స్ అనేవి మొబైల్ యూజర్లకు విసుగు తెప్పిస్తూనే ఉన్నాయి. వీటిని నివారించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం చర్యలు తీసుకుంటున్నప్పటికి సమస్య తగ్గుముఖం పట్టటం లేదు. స్పామ్ కాల్స్‌ను నివారించేందుకు పలు థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికి వాటివల్ల అంతగా ప్రయోజనం ఉండటం లేదు. స్పామ్ కాల్స్ బెడద రోజురోజుకు పెరిగిపోతోన్న నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ ఫోన్ యాప్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి బేటా వెర్షన్‌లో ఉన్న ఈ ప్రోగ్రామ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వచ్చే స్పామ్ కాల్స్‌ను సులువుగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఫోన్ యాప్‌కు సంబంధించిన సపోర్ట్ పేజీలో ఈ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను గూగుల్ పొందుపరిచింది.

 
spam calls

'కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్' పేరుతో..
'కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్' పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. సపోర్ట్ పేజీలో అప్‌డేట్ చేసిన వివరాల ప్రకారం గూగుల్ ఫోన్ యాప్ ఇప్పుడు స్పామ్ కాల్స్‌ను ఫిల్టర్ చేయగలుగుతోంది. అన్‌వాంటెడ్ కాల్స్‌ను డిటెక్ట్ చేసిన వెంటనే నేరుగా ఆ వివరాలను వాయిస్ మెయిల్‌కు అందచేస్తుంది. కాలర్ ఐడీ లేదా స్పామ్ ప్రొటెక్షన్ ఆన్ అయి ఉన్నపుడు ఏదైనా స్పామ్ కాల్ వచ్చినట్లయితే ఆ కాలర్స్ గురించి గూగుల్ మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది.

 

రూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండిరూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండి

యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా..
కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది.

మొబైల్ స్ర్కీన్‌ను ఎరుపు రంగులోకి మారిపోతోంది...
స్పామ్ కాల్స్ వచ్చినపుడు మీ ఫోన్ రింగ్ అవకుండా ఉండేదుకు సస్పెక్టెడ్ స్పామ్ కాల్ ఫిల్టర్‌ను టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుందని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతానికయితే ఏదైనా స్పామ్ కాల్ వచ్చినపుడు ఫోన్ యాప్ మొబైల్ స్ర్కీన్‌ను ఎరుపు రంగులోకి మార్చేస్తోంది.

Best Mobiles in India

English summary
The problem of dealing with unwanted and pesky calls has grown multifold over the years. While there are third-party apps that do help you in tackling the issue, it still wasn’t that foolproof.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X