వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక చాటింగ్ మరింత సులువు

120 కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మార్కెట్‌ను శాసిస్తోన్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు తమ ఫేవరెట్ చాట్‌ను టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతానికి వాట్సాప్ బేటా వర్షన్ (2.17.162 లేదా 2.17.163)లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read More : రిలయన్స్ బంపరాఫర్, రూ.54కే నెలంతా 4జీ, తెలుగు వారికి మాత్రమే ఆఫర్?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ చాట్ విండోలోకి వెళ్లి ..

బేటా టెస్టర్‌లు ఈ వర్షన్‌లకు అప్‌డేట్ అవటం ద్వారా ఈ పిన్నింగ్ ఫీచర్‌ను పరీక్షించుకోవచ్చు. వాట్సాప్ చాట్ విండోలోకి వెళ్లి వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ పై ప్రెస్ చేసి కొద్ది సెకన్లు హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఆ చాట్ టాప్‌లో పిన్ అవుతుంది. పిన్ అయిన చాట్‌ను నిర్ణీత సమయంలో క్రిందకు వచ్చేసి మరొక చాట్ పిన్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

నిత్యం సరికొత్త అప్‌డేట్స్..

నిత్యం సరికొత్త అప్‌డేట్‌లతో వాట్సాప్ శక్తివంతమైన యాప్‌గా రూపాంతరం చెందుతోంది. వాట్పాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన నాటినుంచి మార్కెట్లో వాట్సాప్ దూకుడు మరింతగా పెరిగింది. ఇన్‌స్టెంట్ మెసెజింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంచలనాత్మక ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

మీ బ్యాంక్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఎలా లూటీ చేస్తారంటే..?

ఇటాలిక్స్ రూపంలో మారాలంటే..

వాట్సాప్‌లో మీరు పంపే మెసెజ్ బోల్డ్‌గా ఉండాలంటే అక్షరాలకు ముందూ చివరా ‘*' (స్టార్) సింబల్ ను యాడ్ చేయండి. ఇదే సమయంలో మీరు పంపే మెసెజ్ ఇటాలిక్స్ రూపంలో ఉండాలటే అక్షరాలకు ముందు చివరూ ‘_' (అండర్ స్కోర్) సింబల్‌ను యాడ్ చేయండి. మీరు పంపే మెసెజ్ టెక్స్ట్ పై అండర్‌స్ట్రైక్ ఉండాలంటే పదాలకు ముందు చివరాల ‘~' సింబల్‌ను యాడ్ చేయండి.

పీడీఎఫ్ ఫైల్ షేరింగ్..

ఆండ్రాయిడ్ యూజర్లు, యాప్ ఇంటర్‌ఫేస్ టాప్ రైట్ కార్నర్ భాగంలో కనిపించే అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా పీడీఎఫ్ ఫైల్ షేరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. యాపిల్ ఐఓఎస్ యూజర్లు, యాప్ ఇంటర్‌ఫేస్ అడుగున కనిపించే Arrow up ఐకాన్ పై టాప్ చేయటం ద్వారా పీడీఎఫ్‌లను పంపుకోగలిగే డాక్యుమెంట్‌ ఆప్షన్‌ను చూడగలుగుతారు.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయటం ఎలా..?

వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌..

గతంలో ఇత‌ర వెబ్‌సైట్‌ లింక్‌ల‌ను షేర్ చేయ‌డం వాట్సాప్‌లో వీల‌య్యేది కాదు. తాజా అప్‌డేట్‌లో ఫేస్‌బుక్‌ తరహా వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ను వాట్సాఫ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి వాట్సాప్‌లో కూడా వివిధ వెబ్‌సైట్స్ లింక్‌ల‌ను షేర్ చేసుకోవచ్చు.

 

వీడియో కాలింగ్ ..

వాట్సాప్ ఎట్టకేలకు తన యూజర్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసుకునే క్రమంలో డైలర్ ఐకాన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది. డైలర్ ఐకాన్ పై ప్రెస్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది. వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా కాల్ వెళుతుంది. మీరు వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తులు కూడా వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉండాలి.

డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

GIF ఫైల్‌‌ సపోర్ట్..

వాట్సాప్ ద్వారా GIF ఫైల్‌‌ను తయారు చేయాలంటే ముందుగా యాప్ పేజీలోని అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అటాచ్‌మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు 6 రకాల ఆప్షన్స్ మీకు కనపిస్తాయి. వాటిలో కెమెరా ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే Take picture, Record Video పేరుతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో రికార్డ్ వీడియో ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో రికార్డింగ్ ఓపెన్ అవుతుంది. మీరు రికార్డ్ చేసే వీడియో 6 సెకన్ల కంటే తక్కువ టైమ్ వ్యవధిలో ఉండాలి. వీడియో అటాచ్ మెంట్ సిద్ధమైన వెంటనే క్యామ్ కార్డర్ ఐకాన్ తో పాటు ట్రిమ్మింగ్ పేజీ మీకు కనిపిస్తుంది. ఈ పేజీలో GIF ఫైల్ కావల్సిన విధంగా ట్రిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెండ్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే వీడియో కాస్తా GIF ఫైల్ గా మారిపోతుంది.

ఎడిటింగ్ టూల్స్..

వాట్సాప్ ద్వారా మీరో ఇమేజ్‌ను చిత్రీకరించిన వెంటనే, ఆ ఫోటో క్రింద కొన్ని ఎడిటింగ్ టూల్స్ మీకు కనిపిస్తాయి. Cropping, Emojis, Type option, Pencil, draw or scribble వంటి ఆప్షన్‌లను మీరు చూడొచ్చు. అవసరాన్ని బట్టి వీటిని వాడుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్ ..

పబ్లిక్ గ్రూప్ ఇన్వైట్ లింక్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేసింది. ఈ ఇన్విటేషన్ లింక్‌ను అందుకున్న వ్యక్తి ఆ గ్రూపు‌ను ఎవరు రన్ చేస్తున్నారు, దానిలో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు వంటి వివరాలను మెసెజ్ రూపంలో పొందుతారు. తద్వారా ఆ గ్రూపులో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

New zoom feature

New zoom feature వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో న్యూ జూమ్ ఫీచర్ కూడా ఒకటి. ఈ ఫీచర్ ద్వారా చాలా దూరంలో కనిపించే దృశ్యాలను వీడియో లేదా ఫోటో రూపంలో క్యాప్చర్ చేయవచ్చు. మీ వేలును పైకి క్రిందకు జరపటం ద్వారా జామ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. డబల్ ట్యాప్ చేయటం ప్రంట్ర అలారే రేర్ ఫేసింగ్ కెమెరాల మధ్య స్విచ్ కావొచ్చు.

ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

ఫోటోస్ అలానే వీడియోలకు అదనపు హంగులు

వాట్సాప్ తీసుకువచ్చిన రీసెంట్ అప్‌డేట్స్‌లో ఎడిటింగ్ టూల్స్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీరు పంపే ఫోటోస్ అలానే వీడియోలకు అదనపు హంగులను జోడించవచ్చు. ఫోటల పై మీకు నచ్చిన టెక్స్ట్‌ను యాడ్ చేయటం, ఫాంట్ స్టైల్ మార్చటం, వివిధ రంగలను అప్లై చేయటం వంటి ఈ ఎడిటింగ్ టూల్ ద్వారా సాధ్యమవుతాయి.

Selfie flash ..

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Selfie flash పేరుతో సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింటి. ఈ టూల్ ద్వారా యూజర్లు తక్కువ వెళుతరులోనూ నాణ్యమైన సెల్ఫీలను చిత్రీకరించుకోగలుగుతారు.

క్వాలిటీ తగ్గకుండా ఫోటో సైజును తగ్గించటం ఎలా..?

వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌..

నిన్న మొన్నటి వరకు ఏదైనా వాట్సాప్ వీడియోను ఓపెన్ చేయాలంటే, ఆ వీడియోను పూర్తిగా డౌన్లోడ్ చేుసుకుని ఓపెన్ చేయవల్సి వచ్చేది. ఇక పై ఆ పరిస్థితి ఉండబోదు. తాజాగా, వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌లో భాగంగా, వాట్సాప్ వీడియోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ట్రీమ్ చేసుకోవచ్చు. వీడియో ఉపయోగపడుతుందనుకుంటేనే డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. దీని వల్ల బోలెడంత డేటా ఆదా అవుతుంది. ఇటీవల వీడియో కాలింగ్ ఫీచర్‌ను లాంచ్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తాజాగా వీడియో స్ట్రీమింగ్ పేరుతో మరో ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బేటా వర్షన్ 2.16.365లో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now you can pin your favourite chats on top on WhatsApp. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot