ఇప్పుడు జీమెయిల్‌లో 50MB పైల్స్ కూడా పంపుకోవచ్చు
గతంలో ఈ సామర్థ్యం 25MB మాత్రమే
జీమెయిల్ యూజర్లు ఇక పై తాము పంపే ప్రతి ఈమెయిల్‌కు 50MB సామర్థ్యం గల అటాచ్‌మెంట్స్‌ను జత చేసుకోవచ్చు. గతంలో ఈ సామర్థ్యం 25MB మాత్రమే. ఈ కొత్త అప్‌డేట్‌ను మరో మూడు రోజుల్లో అందరికి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గూగుల్ తెలిపింది.
Jio ఎందుకంత బెస్ట్..?

వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా
వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా ఓ అరగంట సేపు కష్టపడి ఓ వర్డ్ డాక్యుమెంట్‌ను తయారు చేసి ముఖ్యమైన వ్యక్తులకు చకచకా మెయిల్ చేసేసారు. తీరా సెండ్ బటన్ నొక్కినాక పంపిన డాక్యుమెంట్‌లో తప్పులున్నట్లు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు..? ఆ డాక్యుమెంట్ ను సరిచేసి మళ్లి వాళ్లు మెయిల్ చేస్తారా..?

Undo Send..
జీమెయిల్‌లో అందుబాటులో ఉన్న Undo Send ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా పంపిన మెయిల్ ను 30 సెకన్ల లోపు అండూ బటన్ ను ప్రెస్ చేసి ఆపు చేసుకునే అవకాశముంది. జీమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Undo Send ఫీచర్ ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉంటుంది.

నచ్చినట్లు కీబోర్డ్ షాట్‌కట్స్..
జీమెయిల్ సెట్టింగ్స్ పేజీలోని కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఫీచర్‌లోకి వెళ్లటం ద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించి మీకు నచ్చినట్లు కీబోర్డ్ షాట్‌కట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రివ్యూ ల్యాబ్స్ ఫీచర్
జీమెయిల్ ప్రివ్యూ ల్యాబ్స్ ఫీచర్ ద్వారా వివిధ సర్వీసుల నుంచి మీ మెయిల్‌కు అందే వీడియోలు, డాక్యుమెంట్లు, వాయిస్ మెయిల్స్, ఈమెయిల్స్ ఇంకా మెసేజ్ లను ప్రివ్యూ రూపంలో చూడొచ్చు.

త్వరతిగతిన చెక్ చేసుకునేందకు..
మెయిల్స్‌ను త్వరతిగతిన చెక్ చేసుకునేందకు వీలుగా ఆటో అడ్వాన్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను జీమెయిల్ అందిస్తోంది.


Click it and Unblock the Notifications








