Home
Apps

పంపిన మెయిల్స్‌ సీక్రెట్ మోడ్‌లో ఉంచుకోవడం ఎలా ?

మీరు పంపిన ఈ మెసేజ్ ను ఒక రోజు నుండి 5 సంవత్సరాల వరకు మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా గూగుల్ అదనంగా సెక్యూరిటీ ఫీచర్ SMS passcodeని ఆఫర్ చేస్తోంది. మెయిల్ ద్వారా కాని జీమెయిల్ ద్వార

టెక్ దిగ్గజం గూగుల్ జీమెయిల్ లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు అప్ డేట్లను అందిస్తూ వెళుతోంది. హ్యాకర్లు రోజు రోజుకు తమ ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గూగుల్ కూడా సెక్యూరిటీ పరంగా భారీగానే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ కాన్ఫిడెన్సియల్ మోడ్ ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా జీమెయిల్ లో మీరు పంపిన మెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి. మీరు ఈ కొత్త అప్ డేట్ ద్వారా పంపిన మెసేజ్ కి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఎప్పటివరకు ఈమెయిల్ ఉండాలనుకుంటున్నారో అప్పటివరకు టైం సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా అది డిలీట్ అయిపోతుంది. ఏ మెసేజ్ కి అయితే ఎక్సపయిరీ ఇవ్వాలనుకుంటున్నారో దానికే మీరు సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

పంపిన మెయిల్స్‌ సీక్రెట్ మోడ్‌లో ఉంచుకోవడం ఎలా ?

1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు

1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు

మీరు పంపిన ఈ మెసేజ్ ను ఒక రోజు నుండి 5 సంవత్సరాల వరకు మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా గూగుల్ అదనంగా సెక్యూరిటీ ఫీచర్ SMS passcodeని ఆఫర్ చేస్తోంది. మెయిల్ ద్వారా కాని జీమెయిల్ ద్వారా కాని మీరు self-destruct mailని యాక్సస్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్

నోటిఫికేషన్

మీరు పంపిన మెయిల్ ఈ తేదీలోగా ఎక్సపయిరీ అవుతుందని మెసేజ్ అందుకున్న వ్యక్తికి నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ మెయిల్ గడువు ముగిసిన తరువాత దానిని ఓపెన్ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

కొత్త వర్షన్

కొత్త వర్షన్

కాగా ఈ ఫీచర్ న్యూ జీమెయిల్ వర్షన్ వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ వర్షన్ వాడుతున్న వారు కొత్త వర్షన్ కి అప్ డేట్ అయి ఈ ఫీచర్ ని పొందవచ్చు.

ఎలా వాడాలి

ఎలా వాడాలి

కంపోజ్ బాక్స్ లోకి ముందుగా వెళ్లండి. అక్కడ ఎవరికయితే రహస్య మోడ్ లో మెయిల్ పంపాలనుకున్నారో వారి మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మెయిల్ రాసిన తరువాత అక్కడ కనిపించే లాక్ ఐకాన్ ని చెక్ చేయండి. ఇది ఇమేజ్ ఐకాన్ పక్కన ఉంటుంది.

 డేట్ సెట్

డేట్ సెట్

అందులోకి వెళ్లి మీరు గడువు తేదీని సెట్ చేసుకోండి. ఉదాహరణకు ఈ రోజు పంపిన మెయిల్ ని రేపటి వరకు మాత్రమే ఉంచుకోవాలనుకుంటే రేపటి తేదిని ఎంటర్ చేయండి. మీరు కావాలనుకుంటే మీSMS passcodeని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓ సారి చెక్ చేసుకుని మీరు confidential Gmailని పంపండి.

రిసీవర్

రిసీవర్

మెయిల్ అందుకున్న రిసీవర్ ఈ కింది విధంగా నోటిఫికేషన్ అందుకుంటాడు. Content expires Feb 23, 2019. Options to forward, download, or copy this email's contents and attachments are disabled." రిసీవర్ కేవలం దానికి రిప్లయి మాత్రమే ఇవ్వగలడు.

More from GizBot

Best Mobiles in India

English summary
Now you can send confidential and self-destructing emails with Gmail in India, here is how
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X