Home
Apps

గూగుల్ మ్యాప్స్‌లోకి అదిరిపోయే ఫీచర్

గూగుల్ మ్యాప్స్ ఇండియా అదిరిపోయే ఫీచర్ తో ముందుకొచ్చింది.

గూగుల్ మ్యాప్స్ ఇండియా అదిరిపోయే ఫీచర్ తో ముందుకొచ్చింది. ఈ దిగ్గజం ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా మీరు ప్రయాణిస్తున్న బస్సు, అలాగే రైలు వంటి పబ్లిక్ ట్రావెలింగ్ ట్రాన్స్ పోర్టు లైవ్ లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే మీ మిత్రులకు కాని లేకుంటే మీ బంధువులకు కాని నేరుగా ఈ లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు ఏ సమయంలో రీచ్ అవుతారు అనేది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ గురించి కంపెనీ ఇండియాలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే త్వరలో వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది.

గూగుల్ ఇండియా

గూగుల్ ఇండియా

గూగుల్ ఇండియా తన అఫిషియల్ ట్విట్టర్ ద్వారా ఈ రోజు నుంచి మీరు గూగుల్ మ్యాప్ ద్వారా మీ ప్రయాణ వివరాలను, మీకు నచ్చిన వారికి లైవ్ లొకేషన్ అలాగే ఈటీఎని షేర్ చేసుకోవచ్చని ట్వీట్ ద్వారా తెలిపింది. బస్సు, రైలు ఇలా ఏదైనా లైవ్ లొకేషన్ ద్వారా షేర్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ ఫీచర్ వాట్సప్...

ఈ ఫీచర్ వాట్సప్...

ఈ ఫీచర్ వాట్సప్ ద్వారా అందుబాటులో ఉన్న సంగతి మనకు తెలిసిందే, అయితే అక్కడ కేవలం లైవ్ లొకేషన్ షేర్ అనే ఆప్సన్ మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త ఫీచర్ ద్వారా మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న మిత్రులకు మీరు రీచ్ అయ్యే సమయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మెసేంజర్, వాట్సప్, హ్యాంగవుట్స్ వంటి వాటిల్లో ఈ షేర్ ఆప్సన్ ఉంది.

ఎలా షేర్ చేయాలి...

ఎలా షేర్ చేయాలి...

మీరు డెస్టినేషన్ లోకి ఎంటరయిన తరువాత నావిగేషన్ స్టార్ట్ అవుతుంది. కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ మీకు వివరాలతో కూడాని రూట్ మ్యాప్ కనిపిస్తుంది. అక్కడ మీకు షేర్ ట్రిప్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి మీ షేర్ లైవ్ లొకేషన్ ని మీ కాంటాక్ట్స్ లో ఉన్న వారికి మెసేంజర్ ద్వారా కాని, వాట్సప్, హ్యాంగవుట్స్ ద్వారా కాని షేర్ చేసుకోవచ్చు.

 

 

 గూగుల్ వ్యాపారస్తుల కోసం...

గూగుల్ వ్యాపారస్తుల కోసం...

కాగా గూగుల్ వ్యాపారస్తుల కోసం మ్యాప్ లో టెక్ట్స్ మెసేజ్ ఆప్సన్ కూడా పొందుపరిచిన సంగతి తెలిసిందే. మీరు కంటిన్యూగా ఛాటింగ్ చేసుకునే సౌలభ్యాన్ని ఇప్పుడు గూగుల్ అందిస్తోంది. ఈ ఆప్సన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల ఇద్దరికీ అందుబాటులో ఉంది. గూగుల్ మ్యాప్ లోని సైడ్ మెనూలో దీన్ని మీరు చూడవచ్చు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Now you can track live bus, train location of someone using Google Maps more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X