Home
Apps

BHIM 3.0 వచ్చేసింది.. ఇక UPI పేమెంట్స్ మరింత వేగంగా జరిగిపోతాయ్‌.. అదిరిపోయే కొత్త ఫీచర్లు మీకోసం!

BHIM 3.0 Features: భీమ్ యాప్ వాడుతున్నారా అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), తన UPI యాప్ అయిన భీమ్‌కు భారీ అప్‌గ్రేడ్ ఇచ్చింది. అదే భీమ్ 3.0 (BHIM 3.0). ఇది వేగంగా పేమెంట్స్ చేయడానికి, మన ఖర్చుల లెక్కలు తేలిగ్గా చూసుకోవడానికి, ఇంకా చాలా సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వచ్చేసింది.

నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ ఉన్న చోట్ల కూడా లావాదేవీలు సాఫీగా జరిగేలా చూడటం ద్వారా, డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే ఈ అప్‌డేట్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ BHIM 3.0 పూర్తి వెర్షన్ 2025, ఏప్రిల్ నాటికి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

NPCI Launches BHIM 3 0 Faster UPI Payments  Offline UPI Lite  Spend Analytics and New Features

ప్రస్తుతం, 486 బ్యాంకులు భీమ్ యాప్‌తో అనుసంధానమై ఉన్నాయి. ఇంటర్నెట్ స్లోగా ఉన్నా సరే, ఇకపై BHIM 3.0తో UPI పేమెంట్స్ వేగంగా జరిగిపోతాయి. తక్కువ మొత్తంలో చేసే చిన్న చిన్న పేమెంట్ల కోసం మీరు 'UPI లైట్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.

దీనికోసం అసలు UPI నెట్‌వర్క్‌తో కూడా పనిలేదు. అంతేకాదు, మీ లైట్ వాలెట్‌లోని బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మీకు అలర్ట్స్ కూడా వస్తాయి. దీనివల్ల, నెట్‌వర్క్ సరిగా లేని చోట్ల కూడా పేమెంట్స్ ఆగకుండా సాఫీగా జరిగిపోతాయి. చాలామంది సిగ్నల్స్ లేని దగ్గర పేమెంట్స్ జరగక ఇబ్బందులు పడతారు ఇకపై ఆ తలనొప్పులు ఉండవు.

* ఖర్చుల లెక్కలు ట్రాక్ చేసుకోవచ్చు

BHIM 3.0లో 'స్పెండ్ అనలిటిక్స్’ ఫీచర్ మీ ఖర్చులను దానంతట అదే వేర్వేరు కేటగిరీలుగా విభజిస్తుంది. దీనివల్ల, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో పెద్ద పెద్ద లెక్కల షీట్లు చూడకుండానే సులభంగా తెలుసుకోవచ్చు. ప్రతి నెలా ఖర్చుల సరళిపై నివేదికలు, పూర్తి వివరాలను అందిస్తుంది. దీంతో బడ్జెట్ వేసుకోవడం, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా సులభం.

* స్నేహితులతో బిల్లులు పంచుకోవచ్చు, ఫ్యామిలీ మోడ్

స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లారా? రూమ్ రెంట్ షేర్ చేసుకోవాలా? కొత్తగా వచ్చిన 'స్ప్లిట్ ఎక్స్‌పెన్స్’ ఫీచర్‌తో ఇలాంటి బిల్లులను స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేదా కొలీగ్స్‌తో పంచుకోవడం చాలా ఈజీ. మీరు యాప్ నుంచే నేరుగా బిల్లు పంచుకోమని రిక్వెస్ట్‌లు పంపొచ్చు.

Take a Poll

'ఫ్యామిలీ మోడ్' ఫీచర్‌ కూడా ఈ కొత్త అప్‌డేట్‌లో అందించారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులను ట్రాక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి కేటాయించిన చెల్లింపులను చూపిస్తూ, మొత్తం కుటుంబ ఖర్చులను ఒకేచోట చూడొచ్చు. ఇది ఫ్యామిలీ బడ్జెట్ నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది.

* యాప్ వాడటం తెలియదా 'బిల్ట్-ఇన్ అసిస్టెంట్’ ఉందిగా.

BHIM 3.0 యాప్ వాడటం కొత్త అయినా, ఏ ఫీచర్ ఎక్కడుందో తెలియకపోయినా కంగారు పడవద్దు. యాప్‌లోనే 'బిల్ట్-ఇన్ అసిస్టెంట్’ ఉంది. ఇది కొత్త యూజర్లకు స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ ఇస్తుంది, అలాగే పేమెంట్ ఫీచర్లను వేగంగా యాక్సెస్ చేయడానికి సాయపడుతుంది. టెక్నాలజీతో అంతగా పరిచయం లేని వారూ డిజిటల్ పేమెంట్లను వాడేలా చేయడమే దీని ఉద్దేశ్యం.

* వ్యాపారుల కోసం ప్రత్యేకం BHIM వేగా (Vega)

వ్యాపారుల కోసం BHIM 3.0 ప్రత్యేకంగా 'భీమ్ వేగా' (BHIM Vega) అనే ఫీచర్‌ను తెచ్చింది. ఇది వ్యాపారుల యాప్‌లలోనే నేరుగా పేమెంట్ పూర్తిచేసే ఒక అద్భుతమైన పరిష్కారం. దీనివల్ల కస్టమర్లు పేమెంట్ కోసం వేరే థర్డ్-పార్టీ యాప్స్‌కి మారాల్సిన పనిలేదు, చెక్అవుట్ చాలా వేగంగా అయిపోతుంది.

ఇది పేమెంట్ మధ్యలో ఆగిపోయే (డ్రాప్-ఆఫ్) సమస్యలను తగ్గించి, కస్టమర్ల సంతృప్తిని పెంచడంలో వ్యాపారులకు బాగా సహాయపడుతుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో, BHIM 3.0 యాప్ ఇప్పుడు Paytm, PhonePe, గూగుల్ పే వంటి వాటికి పోటీదారుగా నిలుస్తుంది. మరింత వేగవంతమైన, స్మార్ట్, అనుకూలమైన UPI పేమెంట్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమైంది.

More from GizBot

Best Mobiles in India

English summary
NPCI launches BHIM 3.0. Experience faster UPI payments, offline support, Spend Analytics, Split Expense and more. Update enhances digital payments, targets market growth.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X