ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న Ola క్యాబ్ సేవలు

|

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ఓలా తన సేవలను ఆస్ట్రేలియాలోనూ ప్రారంభించబోతోంది. ఆస్ట్రేలియా వ్యాప్తంగా మరికొద్ది నెలల్లోనే ఓలా (Ola) క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ కో-ఫౌండర్ భవిష్ అగర్వాల్ తెలిపారు. సిడ్నీ, మెల్‌బోర్న్ ఇంకా పెర్త్ రాష్ట్రాల్లో డ్రైవర్ రిక్రూట్‌మెంట్ ప్రాసస్‌ను ఇప్పటికే మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు.

 
ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న Ola క్యాబ్ సేవలు

భారత్‌లో ఓలా క్యాబ్ సర్వీసెస్‌కు ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచిన 'ఉబెర్’ (Uber) 2012 నుంచే ఆస్ట్రేలియాలో క్యాబ్ బుకింగ్ సేవలను అందిస్తోంది. మరో సంస్థ అయిన ట్యాక్సిఫై కూడా కొద్ది నెలల క్రితమే తన సేవలను ఆస్ట్రేలియాలో ప్రారంభించింది. ఓలా క్యాబ్ సర్వీసుతో రిజిస్టర్ అయ్యే యూజర్లు తమ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ఇన్ అయి వారి వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిమిత్తం ఓలా ప్రతినిధులు సంబంధిత డ్రైవర్‌ను సంప్రదిస్తారు.

2010లో ప్రారంభమైన ఓలా క్యాబ్ సర్వీస్, ఉబెర్ వంటి అంతర్జాతీయ కంపెనీలకు ప్రధాన పోటీదారుగా నిలిచింది. దేశవ్యాప్తంగా 9 లక్షల డ్రైవర్ పార్టనర్స్‌ను ఈ సర్వీస్ కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 110 నగరాల్లో ఓలా సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ ఓలా తన కార్యకాలాపాలను నిర్వహిస్తోంది. 12.5కోట్ల మంది యూజర్లు తమ సేవలను వినియోగించుకుంటున్నట్లు ఓలా తెలిపింది.

ఓలా కంపెనీ దేశవ్యాప్తంగా 73 నగరాల్లో ఆటోరిక్షా సర్వీసును రన్ చేస్తోంది. తమ సర్వీస్ అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లోనూ ఈ కాంప్లిమెంటరీ వై-ఫై సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఓలా తెలిపింది. ఇప్పటికే ఓలా సేవాలను వినియోగించుకుంటోన్న యూజర్లకు ట్రిప్ ప్రారంభమైన వెంటనే వై-ఫైకు ఆటోమెటిక్‌గా కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్-టైమ్ యూజర్లు మాత్రం "వన్-టైమ్ అథంటికేషన్" ద్వారా వై-ఫై కనెక్టువిటీని యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది.

మెరుపు వేగంతో చంద్రుని పక్కనుంచి దూసుకెళ్లిన ఆ వస్తువేంటి..? వైరల్ వీడియో ఇదే..?మెరుపు వేగంతో చంద్రుని పక్కనుంచి దూసుకెళ్లిన ఆ వస్తువేంటి..? వైరల్ వీడియో ఇదే..?

Best Mobiles in India

Read more about:
English summary
Ride-hailing service company Ola is set to launch itself in Australia in the coming few months. Company's co-founder and chief executive Bhavish Aggarwal made the announcement on Tuesday in a press statement.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X