ఓలా ఆటోల్లో WiFi కనెక్టువిటీ

|

మీరు ఓలా ఆటో వినియోగదారులా? అయితే మీకో శుభవార్త. నిన్నమొన్నటి వరకు క్యాబ్ రైడర్స్‌కు మాత్రమే పరిమితమైన ఉచిత వై-ఫై కనెక్టువిటీ సదుపాయాన్ని ఇప్పుడు ఆటో రైడర్స్‌కు ఓలా అందుబాటులోకి తీసుకువచ్చేసింది.

Ola launches Auto-Connect Wifi to its auto-rickshaw facility

ఓలా కంపెనీ దేశవ్యాప్తంగా 73 నగరాల్లో ఆటోరిక్షా సర్వీసును రన్ చేస్తోంది. తమ సర్వీస్ అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లోనూ ఈ కాంప్లిమెంటరీ వై-ఫై సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఓలా తెలిపింది.

ఇప్పటికే ఓలా సేవాలను వినియోగించుకుంటోన్న యూజర్లకు ట్రిప్ ప్రారంభమైన వెంటనే వై-ఫైకు
ఆటోమెటిక్‌గా కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్-టైమ్ యూజర్లు మాత్రం "వన్-టైమ్ అథంటికేషన్" ద్వారా వై-ఫై కనెక్టువిటీని యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది.


తమ ఆటో-కనెక్ట్ వైఫై సర్వీస్, ఆటోరిక్షా రైడర్స్‌కు కనెక్టెడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయటంతో పాటు సరికొత్త ప్రయాణ అనుభూతులను నింపుతుందని ఓలా ఇండియా సీనియర్ డైరెక్టర్ సిద్ధార్థ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

డెల్ కొత్త ల్యాప్‌టాప్.. 'XPS 15'డెల్ కొత్త ల్యాప్‌టాప్.. 'XPS 15'

‌తొలత ఈ వై-ఫై సేవలను సెడాన్, ఎస్‌యూవీ వంటి హై-ఎండ్ కార్లను బుక్ చేసకునే ప్రైమ్ యూజర్లకు మాత్రమే ఓలా అందుబాటులో ఉంచింది. ఆ తరువాత మైక్రో, మినీ, లగ్జరీ విభాగాలకు ఈ కాంప్లిమెంటరీ వై-ఫై సర్వీసును విస్తరించుకుంటూ వచ్చింది. తాజాగా ఆటో రిక్షాల్లోనూ ఓలా ఈ సదుపాయాన్ని ప్రారంభించింది.

ఓలా ప్రైమ్ యూజర్లు నెలకు 200 టీబీల డేటాను వినియోగించుకుంటున్నట్లు కంపెనీ గతంలో ప్రకటించింది. ఒక్కో ఓలా యూజర్ తన ప్రయాణంలో సగటున 20MB డేటాను ఖర్చు చేస్తున్నట్లు ఇటీవల వెల్లడయ్యింది.

2014లో లాంచ్ అయిన ఓలా ప్లాట్‌ఫామ్ క్రింద 1,20,000 ఆటోరిక్షాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఓలా యాప్‌ ద్వారా తమ డ్రైవర్ పార్టనర్స్‌తో ఇంగ్లీష్ సహా 8 ప్రాంతీయ భాషల్లో కమ్యూనికేట్ చేసే వీలుంటుందని ఓలా చెబుతోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Ola soon expanded this offering to other categories including Mini, Lux, and Micro.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X