Home
Apps

Ola Maps ఓలా కొత్త నిర్ణయంతో సంవత్సరానికి రూ.100 కోట్ల ఖర్చు తగ్గింది.. పూర్తి వివరాలు..!!

ప్రముఖ క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (OLA) ఇటీవల కీలక ప్రకటన చేసింది. తాము సొంత మ్యాప్స్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఓలా వినియోగిస్తున్న గూగుల్‌ మ్యాప్స్‌ స్థానంలో ఓలా మ్యాప్స్‌ ను (Ola Maps) వినియోగించనున్నట్లు తెలిపింది. యాప్‌ ను అప్‌ డేట్‌ చేసుకొని సర్వీసులను పొందవచ్చని ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. గత నెలలో మైక్రో సాఫ్ట్‌ అజూర్‌ నుంచి బయటకొచ్చిన ఓలా తాజాగా గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగాన్ని కూడా నిలిపివేసింది.

ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల ఖర్చు తగ్గింది :
ఇప్పటి వరకు ఈ మ్యాప్స్‌ వినియోగం కోసం ప్రతి సంవత్సరం రూ.100 కోట్లను ఖర్చుచేసినట్లు ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. తాజా నిర్ణయంతో ఈ ఖర్చు సున్నాకు చేరిందన్నారు. ఓలా మ్యాప్స్‌ అనేక కొత్త ఫీచర్‌లను కలిగి ఉన్నాయని చెప్పారు.

ola introduced maps in india

ఓలా మ్యాప్స్‌లో కీలక ఫీచర్‌లు :
స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ ఇమేజెస్‌, త్రీడీ మ్యాప్స్‌, డ్రోన్‌ మ్యాప్స్‌ వంటి ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఓలా సీఈవో తెలిపారు. కృత్రిమ్‌ క్లౌడ్‌లో ఓలా మ్యాప్స్‌ API అందుబాటులో ఉందని ఆసక్తి ఉన్న డెవలపర్లు తమ సొంత యాప్‌ లలో ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

మెరుగైన అనుభూతి అందిస్తుంది :
ఓలా మ్యా్‌ప్స్‌ గురించి తమ బ్లాగ్‌ లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఈవో భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. సోర్స్‌ మరియు ఓలా మ్యాప్స్‌ లో వినియోగించిన టెక్నాలజీ గురించి బ్లాగ్‌ లో వివరిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఓలా మ్యాప్స్‌ మరిన్ని ఫీచర్‌ లను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన అనుభూతి అందిస్తుందని చెప్పారు.

ఓలా క్లౌడ్‌ సర్వీసులను గతంలో మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ నిర్వహించేది. గత నెలలో ఈ సంస్థతో జరిగిన ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ఓలా తెలిపింది. అజూర్‌ స్థానంలో కృత్రిమ్‌ ఏఐ క్లౌడ్‌ సర్వీసులను వినియోగించుకుంటామని సంస్థ తెలిపింది. తాజాగా ఖర్చును తగ్గించుకోవడం సహా మెరుగైన సేవల కోసం స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది.

గూగుల్‌ మ్యాప్స్ ఇటీవలే కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను అందించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ ద్వారా సమీపంలోని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ వివరాలను అందిస్తుంది. రియల్‌టైం డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గానే ఈ వివరాలను మ్యాప్స్‌లో కనిపించనున్నాయి.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Ola maps introduced in india this decision will save rs100 in every year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X