మీ క్యాబ్ ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసేందుకు ఓలా సరికొత్త ప్లాన్

|

సాధారణంగా క్యాబ్ సర్వీసులో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలాసార్లు మనం యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కన్ఫర్మేషన్ అనంతరం నోటిఫికేషన్ డిస్‌ప్లేలో డ్రైవర్ ఫోటోతో సహా వివరాలు వస్తాయి. కానీ పికప్ చేసుకునే డ్రైవర్ మాత్రం మరొక వ్యక్తి ఉంటాడు. నోటిఫికేషన్ లో చూపిన రిజిస్టర్డ్ డ్రైవర్ కాకుండా మరో వ్యక్తి డ్రైవర్ గా వస్తుంటారు. ఇది కొన్నిసందర్భాల్లో ఇబ్బందికరమైన సమస్యలను తెచ్చి పెట్టే ప్రమాదం లేకపోలేదు.

 

దేశంలోని ఇతర నగరాల్లో కూడా.....

దేశంలోని ఇతర నగరాల్లో కూడా.....

ఇప్పటికే ఢిల్లీ - ఎన్‌సీఆర్ పరిసరాల్లో ప్రారంభించారు. అంతేకాదు త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ ప్రయోగాన్ని ప్రవేశపెట్టనున్నారు. డ్రైవర్లు ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడినా వెంటనే యాప్ లో ఎమర్జన్సీ బటన్ నొక్కేందుకు సైతం కస్టమర్లకు అందుబాటులో ఉంచారు.

సెల్ఫీ ఆథెంటికేషన్ సిస్టం ఇలా పనిచేస్తుంది...

సెల్ఫీ ఆథెంటికేషన్ సిస్టం ఇలా పనిచేస్తుంది...

ప్రతీ రోజు క్యాబ్ డ్రైవర్ తన సెల్ఫీని దిగి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏ రోజు ఏ డ్రైవర్ ఏ కారు నడుపుతున్నారో అగ్రిగేటర్ల వద్ద సమాచారం లభిస్తుంది. డ్రైవర్ తన యాప్ ద్వారా ఈ పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతీ రోజు క్యాబ్ డ్రైవర్ తన నూతన సెల్ఫీని అప్ లోడ్ చేయడం ద్వారా కస్టమర్లు ఆ రోజు తాము బుక్ చేసుకున్న క్యాబ్ యొక్క డ్రైవర్ అప్ డేటెడ్ ఫోటో ద్వారా పోల్చుకోవడం సులభం.

తాము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ను....
 

తాము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ను....

కస్టమర్లు తాము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ను సులభంగా పోల్చుకోవడం ద్వారా సురక్షిత మైన ప్రయాణానికి నాంది అనే చెప్పవచ్చు. అంతేకాదు కస్టమర్లు తమ ఫీడ్ బ్యాక్ ను సైతం అగ్రిగేటర్ కు తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు క్యాబ్ డ్రైవర్స్ తమ కస్టమర్లకు భరోసా కల్గించవచ్చు.

 

 

ఒక వేళ డ్రైవర్ మోసం చేస్తే..

ఒక వేళ డ్రైవర్ మోసం చేస్తే..

ఒక్కోసారి ఉదయం సెల్ఫీ దిగి అప్ లోడ్ చేసిన అనంతరం వేరే డ్రైవర్ చేతులు మారి క్యాబ్ నడిపితే, ఓలా సర్విలెన్స్ విభాగం ర్యాండమ్ గా చెక్ చేస్తుంది. ఉదయం అప్ లోడ్ చేసిన ఫోటో, చెకింగ్ లో ఫోటో సరిపడకపోతే వెంటనే తీసుకుంటారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో క్యాబ్ అగ్రిగేటర్స్ మార్కెట్ లో వస్తున్న పోటీని తట్టుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే అంతిమంగా కస్టమర్ల సేఫ్టీనే కేంద్ర బిందువు కావడం ఆహ్వానించదగిన పరిణామం.

Best Mobiles in India

English summary
Ola wants only registered drivers on duty, pilots random selfies authentication for surprise checks.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X