స్విగ్గీ, జొమాటోలో ధరలు ఎక్కువగా ఉన్నాయా.. ONDCలో 50 శాతం డిస్కౌంట్.. రేపటి నుంచే..!!
భారత్‌లో ప్రస్తుతం డిజిటల్ విప్లవం నడుస్తోంది. అందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టుకొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని.. నచ్చిన హోటళ్ల నుంచి ఆర్డర్ పెట్టుకొని నేరుగా ఇంటికే వచ్చేలా చేసుకుంటున్నారు. ఈ రంగంలో స్విగ్గీ, జొమాటో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఈ యాప్‌లోనూ అధిక ధరలు ఉంటున్నాయని కొందరు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరింత తక్కువ ధరకే అదే నాణ్యత కలిగిన ఆహార పదార్ధాలను అందించేందుకు మరో యాప్ అందుబాటులోకి వచ్చిందని మీకు తెలుసా.. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థకు చెందినదని తెలుసా.. అదే ONDC ( ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్).

కేంద్ర ప్రభుత్వ విభాగం అయిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ పరిధిలోని ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఓఎన్‌డీసీ 2022 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో సుమారుగా 236 నగరాల్లో సేవలు అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫాం తాజాగా ఆహారపదార్ధాలపై మంచి ఆఫర్ ప్రకటించింది.
ఓఎన్‌డీసీ సూపర్ సేవర్ సన్‌డేస్ పేరుతో ఓ ఆఫర్‌ను ప్రకటించింది. జూన్ 18 నుంచి ఆఫర్ వర్తించనుంది. నాణ్యమైన ఆహారంతో పాటు ఆకట్టుకొనే డిస్కౌంట్‌లను పొందవచ్చు.
ఇందుకోసం ఓఎన్‌డీసీ మేజిక్‌పిన్, పేటీఎం, ఫోన్‌పే పిన్‌కోడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో సూపర్ సేవర్ సన్‌డేస్ ఆఫర్ మొదటిది. నాణ్యత కలిగిన హైపర్ లోకల్ డెలివరీలను ప్రోత్సహించనుంది. భవిష్యత్‌లో ఓఎన్‌డీసీ వేదికపైకి మరింత మంది భాగస్వామం అవుతారని సంస్థ భావిస్తోంది.

సాంప్రదాయ ఆన్‌లైన్ పుడ్ డెలివరీ యాప్ కంటే ఓఎన్‌డీసీ భిన్నమైన అనుభూతిని ఇస్తుందని ఓఎన్‌డీసీ సీఈవో కోశి తెలిపారు. సూపర్ సేవర్ సన్‌డేస్ ఆఫర్‌ను ఎక్కువ మంది వినియోగదారులు ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌లు అందించిన భాగస్వాములకు అభినందించారు.
సూపర్ సేవర్ సన్‌డేస్‌లో భాగంగా రెబల్ పుడ్ బ్రాండ్ (ఫాసోస్, ఓవెన్ స్టోర్, బెహ్రూజ్ బిర్యానీ), మెక్‌డొనాల్డ్స్, వావ్‌మోమో, పిజ్జా హట్, బార్బెక్యూ నేషన్ వంటి సంస్థల ఆర్డర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ఓఎన్‌డీసీ తెలిపింది. బరిస్టా నుంచి ఎంపిక చేసిన ఆర్డర్‌లపై 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్లు పొందవచ్చని తెలిపింది. ఓఎన్‌డీసీ నుంచి ఎలా ఆర్డర్ చేయాలో కూడా తెలిపింది. పేటిఎం, ఫోన్‌పే యాప్‌ల నుంచి ఆర్డర్ చేయవచ్చని పేర్కొంది.
పేటీఎం నుంచి ఎలా ఆర్డర్ చేయాలంటే..
- పేటీఎం ఓపెన్ చేయాలి.
- సెర్చ్ బార్‌లో ఓఎన్‌డీసీ కోసం సెర్చ్ చేయాలి.
- ఓఎన్‌డీసీ స్టోర్ ఆప్షన్‌పైన ట్యాప్ చేయాలి.
- అందులో మీకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు.
- అనంతరం అడ్రస్, పేమెంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి
- అనంతరం ప్లేస్ ఆర్డర్‌పైన క్లిక్ చేయాలి.
ఫోన్‌పే ద్వారా ఎలా ఆర్డర్ చేయాలి..
- ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి పిన్‌కోడ్ ఐకాన్‌పైన క్లిక్ చేయాలి.
- మీకు నచ్చిన రెస్టారెంట్ లేదా ఆహారాన్ని ఎంపికచేసుకోవాలి.
- నచ్చిన ఆహారాన్ని కార్ట్‌లో యాడ్ చేసుకోవాలి.
- డెలివరీ అడ్రస్ మరియ పేమెంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ప్లేస్ ఆర్డర్‌పైన క్లిక్ చేయాలి
- ఆర్డర్ పెట్టాక మెసెజ్ వస్తుంది. డెలివరీ స్టేటస్‌ను యాప్‌లో ట్రాక్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications