ఫేస్‌బుక్ బాటలో గూగుల్ యాప్స్, ఆందోళన కలిగిస్తున్న పిల్లల భద్రత

ఒకవైపు ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ వ్యవహారం యూజర్లలో అనేక సందేహాలను ,భయాలను రేకెత్తించగా ఇప్పుడు తాజాగా ఓ రిపోర్టు మళ్లీ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

|

ఒకవైపు ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ వ్యవహారం యూజర్లలో అనేక సందేహాలను ,భయాలను రేకెత్తించగా ఇప్పుడు తాజాగా ఓ రిపోర్టు మళ్లీ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఓస్వతంత్ర రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లోని 3,300 ఆండ్రాయిడ్ యాప్స్ చిన్న పిల్లల మీద డేటాను సేకరిస్తోందని తెలిపింది. ఈ రిపోర్ట్ తో గూగుల్ పిల్లల గోప్యతా చట్టాలను ఉల్లఘింస్తోందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి . గూగుల్‌కు చెందిన 3వేలకు పైగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత యాప్స్‌లో వినియోగదారుల వ్యక్తగత వివరాలను అక్రమంగా ట్రాక్‌ అవుతోంది.

google apps

ముఖ్యంగా బాలల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోంది. అమెరికా ఫెడరల్‌ చట్టంలోని పిల్లల ఆన్‌లైన్‌ గోప్యతా రక్షణ చట్టం ( చిల్డ్రన్స్‌ ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌)కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు నిర్వహించిన ఒక ఇండిపెండెంట్‌ సర్వే ఈ షాకింగ్‌ అంశాలను వెల్లడించింది. ఒక నూతన ఆటోమేటెడ్ సిస్టమ్‌ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు.

రష్యా సైబర్ అటాక్, విరుచుకుపడుతున్న అమెరికా, బ్రిటన్‌ !రష్యా సైబర్ అటాక్, విరుచుకుపడుతున్న అమెరికా, బ్రిటన్‌ !

ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ (ఐసిఎస్ఐ) నివేదించిన సమాచారం ప్రకారం, పరిశోధనలో భాగంగా గూగుల్ ప్లేలోని మొత్తం 5,855 ఆండ్రాయిడ్ యాప్స్‌ను పరిశీలించింది. వీటిలో సగానికి (3,337) పైగా ఫ్యామిలీ, పిల్లల యాప్స్‌ అమెరికా గోప్యతా చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా తస్కరిస్తున్నాయని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సుమారు 256 యాప్స్‌ 13 సంవత్సరాల లోపు పిల్లల లొకేషన్‌ డేటాను కూడా సేకరించిందని చెబుతోంది.

ఇంత కీలకమైన వ్యక్తిగత వివరాలను సేకరించడం ఆందోళన కలిగించే అంశమని రిపోర్టు పేర్కొంది. వీటిలో పేర్లు, ఇమెయిల్, చిరునామాలు, ఫోన్ నంబర్లు లాంటివి ఉన్నాయని ఇండిపెండెంట్ నివేదిక పేర్కొంది. అయితే దీనిపై స్పందించేందుకు గూగుల్‌ ప్రతినిధులు అందుబాటులో లేరని తెలిపింది. గూగుల్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫాం యూ ట్యూబ్‌ ఉద్దేశపూర్వకంగా పిల్లల డేటాను సేకరిస్తూ కోపా నిబంధలను ఉల్లంఘింస్తోందంటూ 20కిపైగా కన్జ్యూమర్‌ ఎడ్వకసీ గ్రూప్స్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ అధ్యయనం చేసింది.

Best Mobiles in India

English summary
Over 3000 apps on Google Play tracking your data: Study More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X