నకిలీ BHIM యాప్‌లతో జాగ్రత్త, ఒరిజనల్ యాప్‌ పొందాలంటే..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 నకిలీ వర్షన్ భీమ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

|

డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ మోదీ సర్కార్ రూపొందించిన మొబైల్ యాప్ భీమ్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్ ఇంటర్‌ఫేస్ ఆఫ్ మనీగా పేర్కొనబడుతోన్న ఈ యాప్ సాధారణ ఫీచర్ ఫోన్ దగ్గర నుంచి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు అన్ని డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా భీమ్ యాప్ పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండానే భీమ్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

Read More : మీ పాత నెంబర్‌తోనే జియోలోకి మారటం ఎలా..?

భీమ్ యాప్‌

కేవలం మొబైల్ నెంబర్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నగదును వేరొకరకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసలబాటును భీమ్ కల్పిస్తుంది. భీమ్ యాప్ వాడటానికి ఏ విధమైన మొబైల్ నుంచైనా *99# ను డయల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల హిస్టరీ కోసం వివిధ కోడ్స్ మనకు దర్శనమిస్తాయి. ఈ యాప్‌తో రూ .10 వేల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. భీమ్ యాప్ అచ్చం డెబిట్ కార్డు మాదిరి కస్టమర్ల ఫోన్‌కు డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి పేమెంట్లు వెనువెంటనే జరిగిపోతాయి.

Read More : సడెన్‌గా డెడ్ అయిన కంప్యూటర్‌ను క్షణాల్లో రిపేర్ చేయటం ఎలా?

భీమ్ యాప్‌

లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే 30 లక్షల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న భీమ్ యాప్‌‌కు నకిలీల బెడద తప్పటం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 నకిలీ వర్షన్ భీమ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కాబట్టి వీటి ఎంపిక విషయంలో యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరిజనల్ BHIM యాప్‌ను మీ ఫోన్‌లో పొందాలంటే ఇలా చేయండి..

Read More : 3జీబి ర్యామ్‌తో పాటు కేక పుట్టించే ఫీచర్లు, రూ.6,666కే

భీమ్ యాప్‌

గూగుల్ ప్లే స్టోర్‌లో BHIM app అని మీరు టైప్ చేసిన వెంటనే భీమ్ యాప్ పేరుతో అనేక పేర్లు మీకు కనిపిస్తాయి. అయితే ఒరిజనల్ BHIM యాప్‌ను National Payments Corporation of India (NPCI) డెవలప్ చేసింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ కు సంబంధించిన లోగో రెండు ఏకకాలిక త్రిభుజాలను కలిగి ఉంటుంది. అందులు మొదటి త్రిభుజం ఆరెంజ్ రంగులో, మరొక త్రిభుజం పచ్చ రంగులో ఉంటుంది. లోగో పై ఏ విధమైన టెక్స్ట్ ఉండదు. BHIM పేరుతోనే యాప్ ఉంటుంది. ఒరిజనల్ BHIM యాప్‌ను పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Over 40 Fake BHIM Apps Spotted on Google Play Store, Tips to Find the Original App. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X